టాలీవుడ్ లో రెండు తరాల హీరోలని కవర్ చేసిన హీరోయిన్స్ వీరే...!

Sat Jul 04 2020 18:30:56 GMT+0530 (IST)

Heroines covered two generations of Tollywood

సినీ పరిశ్రమ అనేది మేల్ డామినేషన్ ఇండస్ట్రీ అనేది అందరికి తెలిసిన విషయమే. హీరోయిన్స్ కి ఇతర నటీమణులకు మొదట్లో ఛాన్సెస్ వచ్చినా.. వయసు మీద పడే కొద్దీ అవకాశాలు తగ్గిపోతూ ఉంటాయి. హీరోలు మాత్రం 40 ఏళ్ళ  నుండి ఇండస్ట్రీలో పాతుకుపోయి ఉన్నా ఇంకా హీరోలుగా కొనసాగుతూనే ఉంటారు. ఇక వారితో యాక్ట్ చేసిన హీరోయిన్లకు మాత్రం కొన్నేళ్ళకే కెరీర్ అయిపోతుంది. దీంతో సపోర్టింగ్ రోల్స్ తో నెట్టుకురావడానికి రెడీ అవుతారు. అయితే కొంతమంది హీరోయిన్స్ మాత్రం హీరోలకు పోటీగా ఇండస్ట్రీలో తమ హవా చూపిస్తూ వచ్చారు. ఆ జనరేషన్ నుండి ఈ జనరేషన్ హీరోలతోను నటించి హీరోయిన్స్ కూడా హీరోలకు తక్కువేం కాదు అని నిరూపించారు.అతిలోకసుందరి శ్రీదేవి సూపర్ సీనియర్ హీరోలైన ఎన్టీఆర్ - ఏఎన్నార్ - కృష్ణ - శోభన్ బాబులతో నటిస్తూనే తర్వాతి జనరేషన్ హీరోలు చిరంజీవి - నాగార్జున - వెంకటేష్ సరసన నటించింది. ఇక కృష్ణ - శోభన్ బాబు వంటి హీరోలతో నటించిన విజయశాంతి సైతం చిరంజీవి - నాగార్జున - వెంకటేష్ - బాలయ్య లతో రొమాన్స్ చేసింది. నాగేశ్వరరావు సరసన 'వసంత గీతం' 'అదృష్టవంతులు' సినిమాల్లో నటించిన రాధ 'విక్కీదాదా' సినిమాలో నాగార్జునతో కలిసి నటించింది. సూపర్ సీనియర్స్ తో యాక్ట్ చేసిన సుహాసిని నాగార్జున - చిరంజీవి లతో నటించింది. ఈ జనరేషన్ హీరోయిన్స్ కూడా రెండు తరాల హీరోలతో నటించిన వారు ఉన్నారు.

స్టార్ హీరోయిన్ త్రిష బాబాయ్ బాలకృష్ణతో 'లయన్' సినిమాలో నటించి అబ్బాయ్ ఎన్టీఆర్ 'దమ్ము' సినిమాలో రొమాన్స్ చేసింది. అంతేకాకుండా చిరంజీవి 'స్టాలిన్'లో హీరోయిన్ గా యాక్ట్ చేసిన త్రిష పవన్ కళ్యాణ్ తో 'తీన్ మార్'లో నటించింది. ఇక మిల్కీ బ్యూటీ తమన్నా చిరంజీవితో 'సైరా'లో నటించింది.. చరణ్ తో 'రచ్చ'.. పవన్ కళ్యాణ్ తో 'కెమెరామెన్ గంగతో రాంబాబు'.. అల్లు అర్జున్ 'బద్రీనాథ్' సినిమాలలో హీరోయిన్ గా చేసింది. చిరంజీవి పక్కన స్టెప్పులేసిన అమ్మడు కాజల్ అగర్వాల్ 'సర్దార్ గబ్బర్ సింగ్' 'మగధీర' 'నాయక్' 'ఎవడు' 'ఆర్యా 2' సినిమాల్లో నటించింది. ప్రస్తుతం మెగాస్టార్ పక్కన 'ఆచార్య' సినిమాలో కూడా ఈ చందమామే హీరోయిన్.

రకుల్ ప్రీత్ సింగ్ 'కింగ్' నాగార్జునతో 'మన్మథుడు'లో రొమాన్స్ చేయడమే కాకుండా తనయుడు అక్కినేని నాగ చైతన్యతో 'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమాలో యాక్ట్ చేసింది. బాలకృష్ణ 'పల్నాటి బ్రహ్మనాయుడు' సినిమాలో హీరోయిన్ గా నటించిన ఆర్తి అగర్వాల్.. ఎన్టీఆర్ తో 'అల్లరి రాముడు'లో జోడీకట్టింది. ఇక వెంకటేష్ తో లక్ష్మీ తులసి బాబు బంగారం సినిమాల్లో నటించిన నయనతార.. రానా తో కలిసి 'కృష్ణం వందే జగద్గురుమ్'లో కనిపించింది. 'సుభాష్ చంద్రబోస్'లో వెంకీతో అల్లరి చేసిన జెనీలియా.. రానాతో 'నా ఇష్టం' సినిమాలో నటించింది. 'మిత్రుడు' సినిమాలో బాలయ్యతో నటించిన ప్రియమణి.. ఎన్టీఆర్ తో 'యమదొంగ'.. కళ్యాణ్ రామ్ తో 'హరే రామ్' సినిమాలో యాక్ట్ చేసింది.

బాలకృష్ణతో 'చెన్నకేశవరెడ్డి' 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమాల్లో కీలక పాత్రలో నటించిన శ్రీయా సరన్ ఎన్టీఆర్ తో 'నా అల్లుడు'లో రొమాన్స్ చేసింది. 'బాలయ్యతో 'అల్లరి పిడుగు'.. ఎన్టీఆర్ తో 'రాఖీ'లో నటించి ఛార్మీ కూడా రెండు తరాల నటులతో నటించిన హీరోయిన్స్ జాబితాలో చేరిపోయింది. 'సింహాద్రి' సినిమాలో అంకిత 'విజయేంద్రవర్మ' సినిమాలో బాలయ్యతో నటించింది. ఇక 'సోగ్గాడే చిన్ని నాయనా'లో నాగ్ తో రొమాన్స్ చేసిన లావణ్య త్రిపాఠి.. నాగ చైతన్యతో 'యుద్ధం శరణం' సినిమాలో జోడీ కట్టింది. వీరితో పాటు భూమిక ఇలియానా లాంటి హీరోయిన్స్ సీనియర్ హీరోలతో పాటు యంగ్ హీరోల సరసన కూడా నటించి రెండు జెనెరేషన్ హీరోలని కవర్ చేసారు.