అర్రే.. సీనియర్ హీరోలకు పెద్ద చిక్కే వచ్చిందే?

Sat Nov 21 2020 17:20:40 GMT+0530 (IST)

Array .. Is there a big problem for senior heroes?

తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ల కొరత చాలా రోజులుగా ఉంది. మరీ ముఖ్యంగా సీనియర్ హీరోలకు ఈ సమస్య మరీ ఇబ్బందిగా మారింది. వాళ్ళ సినిమాలకు హీరోయిన్లను ఎంపిక చేసేందుకు నిర్మాతలు అవస్థలు పడుతున్నారు. నందమూరి బాలకృష్ణకు అయితే పెద్ద చిక్కు వచ్చిపడింది. ఆయనతో నటించేందుకు హీరోయిన్స్ ఒక పట్టనా సెట్ కావడం లేదట.. ఆయన పక్కన మరీ కుర్ర హీరోయిన్లను పెట్టలేరు. ఇక సీనియర్ హీరోయిన్లు ఎవరూ ప్రస్తుతం రెడీగా లేరు. అంటే వాళ్లు ఇప్పటికే డేట్స్ ఇచ్చేశారు. దీంతో బోయపాటి కాంబినేషన్లో బాలయ్యబాబు నటిస్తున్న బీబీ3 చిత్రానికి హీరోయిన్ ఎవర్నదానిపై తీవ్ర చర్చ నడుస్తున్నది.ఓ సారి అంజలిని హీరోయిన్ అన్నారు. అది కుదరలేదు. సినిమాలు లేక ఢీ షో జడ్జ్‌గా చేస్తున్న పూర్ణను ఓ హీరోయిన్గా ఎంపికచేశారు. కానీ బాలయ్యబాబు సినిమాకు మరో హీరోయిన్ కావాలి. ఇందుకోసం కొంతమంది యువ హీరోయిన్లను ట్రై చేసినా ఎవరూ సెట్ అవలేదు. దీంతో బోయపాటి బాలయ్యకు సెట్ అయ్యే హీరోయిన్‌కు కోసం వేట మొదలు పెట్టాడు.

బాలకృష్ణకు గత కొన్నేళ్లుగా హీరోయిన్ల కొరత వేధిస్తున్నది. బాలకృష్ణతోపాటు ఇతర సీనియర్ హీరోలకు ఇదే సమస్య వచ్చి పడింది. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య మూవీ కోసం చాలామంది హీరోయిన్లను వెతికి చివరకు కాజల్‌నే ఫిక్స్ చేశారు. వెంకటేష్ అయితే శ్రీయని పలు సినిమాల్లో రిపీట్ చేశాడు. నాగార్జునది కూడా అదే పరిస్థితి.

అయితే బాలకృష్ణకు మాత్రం మిగతా అగ్ర హీరోల కంటే కొంచెం ఇబ్బంది ఎక్కువ ఉన్నట్టుంది. ఇప్పటికే షూటింగ్‌లకు అనుమతి దొరకడంతో అన్ని సినిమాల షూటింగ్‌లు ప్రారంభమయ్యాయి. కానీ హీరోయిన్ దొరకక బీబీ3 షూటింగ్ ఆగిపోయింది. బాలకృష్ణ పక్కన నటించేందుకు ప్రగ్య జైస్వాల్ ఒప్పుకున్నట్టు టాక్.

కుర్ర హీరోయిన్లు ముదురు హీరోలతో ముందు నటిస్తే యంగ్ హీరోలు ఇక అవకాశాలు ఇవ్వరేమోనని హీరోయిన్లు భావిస్తున్నారు. అందుకే సీనియర్ల సరసన అవకాశాలు వచ్చినా వదిలేసుకుంటున్నారు.