బిబి3 హీరోయిన్స్.. టైటిల్ ఫిక్స్

Sat Nov 21 2020 17:40:41 GMT+0530 (IST)

BB3 Heroines? .. Title? Fix?

నందమూరి బాలకృష్ణ.. బోయపాటి శ్రీనుల కాంబినేషన్ లో రూపొందుతున్న మూడవ సినిమా టైటిల్ మరియు హీరోయిన్స్ విషయంలో చాలా రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఎట్టకేలకు షూటింగ్ పునః ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో టైటిల్ మరియు హీరోయిన్ విషయంలో స్పష్టత ఇచ్చారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు మోనార్క్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. గతంలో పలు టైటిల్స్ ను పరిశీలించారు. వాటితో పాటు మోనార్క్ ను కూడా అనుకున్నారు. కాని ఇంకాస్త బెటర్ టైటిల్ కోసం ప్రయత్నించారు. చివరకు మోనార్క్ కంటే బెటర్ మరేం ఉండదని భావించి బాలయ్యకు బాగా సెట్ అయ్య మోనార్క్ టైటిల్ ను ఫిక్స్ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.టైటిల్ మోనార్క్ గా ఫిక్స్ చేసిన బోయపాటి హీరోయిన్ విషయంలో కూడా ఒక స్పష్టతకు వచ్చాడని అంటున్నారు. మొన్నటి వరకు సాహేషా సైగల్ ను హీరోయిన్ గా పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ స్థానంలో ప్రగ్యా జైస్వాల్ ను ఎంపిక చేశారట. మరో హీరోయిన్ గా పూర్ణ ఇప్పటికే ఎంపిక అయ్యింది. హీరోయిన్ మరియు టైటిల్ విషయంలో అధికారికంగా ప్రకటన చేయడంతో పాటు షూటింగ్ ప్రారంభం తేదీని అతి త్వరలోనే బోయపాటి ప్రకటిస్తాడని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. వీరిద్దరి కాంబోలో వచ్చిన సింహా మరియు లెజెండ్ సినిమాల రేంజ్ లో మోనార్క్ కూడా మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకంతో నందమూరి అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఈ ఏడాది దసరాకు రావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వచ్చే ఏడాది దసరాకు లేదా కాస్త ముందే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.