Begin typing your search above and press return to search.

పోర్న్ స్టార్ గా ‘హీరోయిన్’!

By:  Tupaki Desk   |   14 Jan 2021 11:30 AM GMT
పోర్న్ స్టార్ గా ‘హీరోయిన్’!
X
‘సమాజం కీర్తించే భారత సాంప్రదాయం ముసుగులో మలినం ఉంది. సొసైటీ చూసే కళా రంగం వెనక గుండె పగిలే గాయం ఉంది. మనం చూసే ప్రతీ అద్భుతం వెనుకా.. మరో నిజం దాగి ఉంది’ అంటున్నారు దర్శకుడు తిరుపతి ఎస్ఆర్. ఆయన దర్శకత్వంలో రాబోతున్న మూవీ ‘హీరోయిన్’. పోర్న్ స్టార్ ఇతివృత్తంతో ఈ చిత్రం తెరకెక్కబోతోంది.

గతంలో 'ఉత్తర' సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన ఈ దర్శకుడు.. 'హీరోయిన్'తో రెండో సారి మెగా ఫోన్ పట్టాడు. ఈ మూవీలో ఎస్తేర్ కథానాయికగా నటిస్తోంది. టాలీవుడ్‌లో ఇప్పటికే పలు చిత్రాల్లో నటించింది ఎస్తేర్. ఇప్పుడు 'హీరోయిన్'సినిమాలో పోర్న్ స్టార్ పాత్రలో యాక్ట్ చేయబోతోంది.

ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. లివ్ ఇన్ సి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది.

త్వరలోనే షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈ మూవీ గురించి దర్శకుడు తిరుపతి ఎస్ఆర్ మాట్లాడుతూ.. ‘ఎరోటిక్ క్రైమ్ థ్రిల్లర్ మూవీగా ‘హీరోయిన్‌’ను తెరకెక్కించబోతున్నాం. టైటిల్ రోల్‌లో ఎస్తేర్ నటిస్తోంది. కథ ప్రకారం ఆమె కొన్ని సీన్స్‌లో బోల్డ్‌గా కనిపిస్తుంది. ప్రస్తుతం షూటింగ్ సన్నాహాల్లో ఉన్నాం. త్వరలో ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల పేర్లు వెల్లడిస్తాం'' అన్నారు.