హీరోయిన్ ఛార్మి షాకింగ్ డెసిషన్.. వద్దు వద్దంటూనే!

Sat May 08 2021 08:00:04 GMT+0530 (IST)

Heroine Charmi Shocking Decision

తన అందచందాలతో కుర్రకారును ఊపేసిన హీరోయిన్ ఛార్మి కౌర్. అందాలు ఆరబోయడానికి.. పరువాలను పారబోయడానికి.. ఏ మాత్రం మొహమాటం చూపించని ఈ బ్యూటీ వెండితెరపై వెలిగినంత కాలం ఫ్యాన్స్ కు సొగసుల విందులు  అందించిందనే చెప్పాలి. హీరోయిన్ స్టార్ డమ్ దిగిపోయిన తర్వాత కూడా ఇండస్ట్రీలోనే కొనసాగుతూ వస్తోందీ బ్యూటీ.డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో కలిసి సినిమాలు నిర్మిస్తూ వస్తోంది.  పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్ పూరీ కనెక్ట్స్ బ్యానర్స్ స్థాపించిన వీరిద్దరూ.. ఇప్పటి వరకూ పలు చిత్రాలను నిర్మించారు. ఆ మధ్య వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'ఇస్మార్ట్ శంకర్’ సినిమా వీళ్లిద్దరూ నిర్మించిందే. అదేవిధంగా.. విజయ్ దేవరకొండతో పూరీ తెరకెక్కిస్తున్న 'లైగర్’  సినిమా కూడా వీళ్ల ఫ్యాక్టరీ నుంచే వస్తోంది. అటు పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాశ్ హీరోగా నటిస్తున్న 'రొమాంటిక్’ చిత్రం కూడా వీళ్లే ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ విధంగా నిర్మాణ పనులు చక్కబెడుతూ.. పూరీ పక్కనే ఉంటోంది చార్మి.

అయితే.. లేటెస్ట్ అప్డేట్ ఏమంటే.. ఛార్మి పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టబోతోందట. ఈ విషయం తెలిసిన చాలా మంది నోరెళ్ల బెడుతుండగా.. ఫ్యాన్స్ హర్టవుతున్నారు. ఎందుకంటే.. తాను పెళ్లి చేసుకునేది లేదంటూ.. ఇంట్రస్ట్ లేదంటూ చాలా సార్లు చెప్పింది చార్మి.

అయితే.. కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు చివరకు మూడు ముళ్లు వేయించుకునేందుకు సిద్ధమైందట. అందుతున్న సమాచారం ప్రకారం.. తమ సమీప బంధువునే పెళ్లాడనుందట ఛార్మి.ఈ ఛార్మి పెళ్లి న్యూస్ నిజామా లేక వట్టి రూమర్ మాత్రమేన అనేది తెలియాలిసి ఉంది