హీరోయిన్ దర్శకుడు.. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారా!

Tue Nov 05 2019 14:21:59 GMT+0530 (IST)

Heroine And Director Caught Red Handledy!

ఒక యంగ్ హీరోయిన్ కు ఆ యంగ్ దర్శకుడు లైఫిచ్చాడు. ఆమెకు ఒక సూపర్ హిట్ సినిమాను ఇచ్చాడు. ఆ సినిమా తర్వాత ఆమెకు గ్లామరస్ గుర్తింపు వచ్చింది. ఇండస్ట్రీలో ఆమె సెటిలయ్యేందుకు అవకాశం లభించింది. ఆ సినిమా రూపొందుతున్నప్పుడే  ఆ హీరోయిన్ కి ఆ దర్శకుడికి ప్రేమ మొదలైందట!కొన్ని రోజుల్లోనే అతి పతాక స్థాయికి వెళ్లిందట. విశేషం  ఏమిటంటే.. అప్పటికే ఆ దర్శకుడికి పెళ్లి అయ్యింది! అయినా ఆ హీరోయిన్ అతడికి దగ్గర అయ్యింది. సినిమా మేకింగ్ దశలోనే వారిద్దరూ అలా దగ్గరయ్యారట.

ఆ ప్రేమ క్రమంగా పెరుగుతూ పెరుగుతూ ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనేంత వరకూ వచ్చిందట. పెళ్లికి రెడీ అయిన వాళ్లిద్దరూ తాజాగా ఒక స్టార్ హోటల్లో ఏకాంతంగా ఉండగా.. అక్కడికి అతడి భార్య వచ్చిందట.

దీంతో అక్కడ గొడవ కూడా జరిగిందని సమాచారం. ఆ హీరోయిన్ పై దర్శకుడి భార్య చేయి కూడా చేసుకుందట. వ్యవహారం అంత వరకూ వచ్చేసరికి భార్యకు విడాకులు ఇస్తానంటూ ఆ దర్శకుడు అంటున్నాడట. భార్యకు విడాకులు ఇచ్చి తన ఇష్టమైన హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలనేది అతడి ఆలోచనగా తెలుస్తోంది.

అయితే అతడిని సినీ పరిశ్రమలోని అతడి సన్నిహితులు వారిస్తున్నారట. మరో దర్శకుడు ఇంకో రచయిత కలిసి ఆ దర్శకుడితో మాట్లాడరట. ముగ్గురూ సిట్టింగ్ వేసిన సందర్భంలో.. హీరోయిన్ తో ఎఫైర్ కొనసాగించుకో కానీ పెళ్లాన్ని నిర్లక్ష్యం చేయవద్దని వారు సూచించారట. ఒక సీనియర్ హీరో కూడా ఆ యంగ్ డైరెక్టర్ కు అదే సలహా ఇచ్చాడట!

బయటవి ఎన్ని ఉన్నా.. ఫ్యామిలీ ఫ్యామిలీనే అని సూచించాడట ఆ వెటరన్ నటుడు. మరి వారి సలహాలు క్లాసుల నేపథ్యంలో కూడా ఆ హీరోయిన్ తో ఆ దర్శకుడు బాగా క్లోజ్ గానే ఉన్నాడని సమాచారం. మరి ఆ హీరోయిన్- దర్శకుడి ప్రేమకథ ముందు ముందు ఇంకా ఎలా సాగుతుందో అనేది సినీ పరిశ్రమ వర్గాల్లో చర్చనీయాంశంగా నిలుస్తోంది.