Begin typing your search above and press return to search.

త‌గ్గాల్సిన హీరోలు పెంచేసారా?

By:  Tupaki Desk   |   10 Jun 2023 7:00 AM GMT
త‌గ్గాల్సిన హీరోలు పెంచేసారా?
X
'ద‌స‌రా' స‌క్సెస్ తో నేచుర‌ల్ స్టార్ నాని తొలి సారి 100 కోట్ల క్ల‌బ్ లో చేరాడు. అత‌ని కెరీర్ లోనే ఇదో మైల్ స్టోన్ మూవీ గా చెప్పొచ్చు. స‌రిగ్గా ఇదే క్రేజ్ తో నాని పారితోషికం పెంచేసాడు? అన్న‌ది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ మ్యాట‌ర్. అవును ఇప్పుడాయ‌న ఒక్కో సినిమా కి 25 కోట్లు డిమాండ్ చేస్తున్నాడ‌ని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తుం ది. కొత్త సినిమా ఏది క‌మిట్ అయినా ఒక‌ పై అడ్వాన్స్ గా 10 కోట్లు..బ్యాలెన్స్ షూటింగ్ మ‌ధ్య‌లో నూ..అనంత‌రం చెల్లించేలా కొత్త రూల్ తీసుకొచ్చిన‌ట్లు వినిపిస్తుంది.

ఇక మాస్ రాజా ర‌వితేజ్ కూడా ఏ మాత్రం త‌గ్గ‌డం లేద‌ని తెలుస్తోంది. ఓ వైపు వ‌రుస ప‌రాజ‌యాలు ఎదురైనా? రెమ్యున‌రేష‌న్ డిమాండ్ మాత్రం త‌గ్గ‌లేదుట‌. ఆయ‌న కూడా ఒక్కో సినిమాకి 25 నుంచి 30 కోట్లు అడుగుతున్నాడుట‌. టైగ‌ర్ నాగేశ్వ‌రావు బ‌యోపిక్ కావ‌డంతో సినిమా పై అంచ‌నాలు బాగున్నాయి. ముందు ప్లాప్ లున్నా ఈసినిమా స‌క్సెస్ అవుతుంది అన్న ధీమా తో! రాజా రూపాయి పెంచే ప్లాన్ లో ఉన్నాడు త‌ప్ప‌! త‌గ్గే ఆలోచ‌న‌లే లేన‌ట్లు వినిపిస్తుంది. నాని-ర‌వితేజ పారితోషికాలు స‌రి స‌మానంగా ఉండటం తో ఇద్ద‌రి పేర్లు ప‌రిశ్ర‌మ‌లో హాట్ టాపిక్ గా మారాయి.

ఇక నిఖిల్...సాయితేజ్...వ‌రుణ్ తేజ్..రామ్ పోతినేని కూడా బాగానే డిమాండ్ చేస్తున్న‌ట్లు తెలుస్తుంది. ఒక్కో సినిమా కి 15 కోట్ల వ‌రకూ ఛార్జ్ చేస్తున్నారుట‌. అంత‌కు ముందు 10 కోట్లు తీసుకునే హీరోలంతా ఇప్పుడు ఏకంగా ఐదు కోట్లు పెంచి కొత్త సినిమాల‌ కు సంత‌కం చేస్తున్న‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. అయితే తాజా ప‌రిస్థితి లో హీరోలు పారితోషికం పెంచ‌డం మంచిది కాద‌న్న విమ‌ర్శ వినిపిస్తుంది.

ప్ర‌స్తుతం సినిమా కాస్ట్ ఆఫ్ ప్రొడ‌క్ష‌న్ బాగా పెరిగిపోయింది. నిర్మాణ వ్య‌యం త‌గ్గించుకోవాల‌ని నిర్మాత‌లంతా భావిస్తున్నారు. దీని కి సంబంధించి ఆ మ‌ధ్య పెద్ద స‌మావేశం కూడా జ‌రిగింది. ఈ నేప‌థ్యం లో కొంద‌రు అగ్ర హీరోల‌ తో కూడా మాట్లాడ‌టం జ‌రిగింది. వాళ్ల లో చాలా మంది త‌మ పారితోషికాలు త‌గ్గించుకున్నట్లు వెలుగులోకి వ‌చ్చింది.

దీంతో ప‌రిస్థితి అదుపు లోకి వ‌చ్చింది అనుకున్న స‌మ‌యం లో తాజాగా టైర్ -2 క్యాట‌గిరీ కి చెందిన హీరోలు రెమ్యున‌రేష‌న్స్ హైక్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ నేప‌థ్యం లో వాళ్లు తగ్గినా-వీళ్లు పెంచి రెండింటి ని బ్యాలెన్స్ చేస్తున్నారా? అంటూ నెట్టింట సెటైర్లు ప‌డుతున్నాయి.