Begin typing your search above and press return to search.

సోష‌ల్ మీడియా టైటిల్స్ పై హీరో ఇరిటేష‌న్!

By:  Tupaki Desk   |   27 March 2023 10:38 AM GMT
సోష‌ల్ మీడియా టైటిల్స్ పై హీరో ఇరిటేష‌న్!
X
సాధార‌ణంగా స్టార్ హీరోల సినిమాల విష‌యంలో మీడియాలో ప్ర‌చారం ఎప్పుడు పీక్స్ లోనే ఉంటుంది. చిత్ర యూనిట్ తో సంబంధం లేకుండా కోట్ల రూపాయ‌ల ఉచి ప‌బ్లిసిటీని వెబ్ మీడియా అందిస్తుం టుంది. సినిమా ప్రారంభం ద‌గ్గ‌ర నుంచి రిలీజ్ అయ్యే వ‌ర‌కూ వెబ్ మీడియా పాత్ర ఎంతో కీల‌కంగా మారిన త‌రుణ‌మిది. ఈ నేప‌థ్యంలో సినిమా గురించి ర‌క‌ర‌కాల ప్ర‌చారాలు సాగుతుంటాయి.

ఆ హీరో ఇలా చేసాడంట‌? అలా చేసాడంట‌? అంటూ అంతా సినిమా గురించి వినిపిస్తుంది. స్టార్ హీరోల విష‌యంలో నెగిటివిటీ చాలా త‌క్కువ‌గానే వినిపిస్తుంటుంది. ఎక్కువగా సినిమా టాపిక్ త‌ప్ప‌! వ్య‌క్తిగ‌త అంశాల జోలికి వెళ్ల‌రు.

ఈ నేప‌థ్యంలో సినిమా టైటిల్స్ విష‌యంలో ఎన్నో ర‌కాలుగా ప్ర‌చారం సాగుతుంటుంది. యూనిట్ నుంచి వ‌చ్చిన లీకులు..అభిమానుల గెస్సింగ్ లు-నిపుణుల అంచ‌నాలు ఇలా అన్నింటిని ఓచోట‌కి చేర్చి టైటిల్స్ విష‌యంలో యూనిట్ అధికారికంగా రివీల్ చేసే వ‌ర‌కూ ప్ర‌చారం సాగుతుంటుంది.

అయితే ఇలాంటి టైటిల్స్ ప్ర‌చార విష‌యంలో టాలీవుడ్ లో పేరున్న ఓ హీరో తెగ ఇరిటేట్ అవుతుంటారుట‌. త‌న సినిమా సెట్స్ లో ఉన్న‌ప్పుడు సోష‌ల్ మీడియాలో వ‌చ్చే టైటిల్స్ త‌న దృష్టికి వెళ్లిన‌ప్పుడు ఇలాంటి ఐడియాలు ఎలా వ‌స్తుంటాయి? అంటూ మేనేజ‌ర్ల వ‌ద్ద రుస‌రుస‌లాడుతుంటాడుట‌. సినిమా స్టోరీకి సంబంధం లేని టైటిల్స్ పెట్టి సినిమాని నెగిటివ్ గా జ‌నాల్లోకి తీసుకెళ్తున్నార‌ని మండిప‌డుతుంటారుట‌.

ఇలాంటి ప్ర‌చారం వ‌ల్ల సినిమాకి న‌ష్టం త‌ప్ప‌! ఎలాంటి ఉప‌యోగం ఉండ‌ద‌న్న‌ది ఆహీరో అభిప్రా య‌మ‌ట‌. అందుకే సోష‌ల్ మీడియాలో త‌న సినిమాకి సంబంధించి ఎలాంటి టైటిల్ వినిపించినా త‌న దృష్టికి త‌ప్ప‌కుండా తీసుకెళ్తారుట వార‌ధులు.

కొన్నేళ్ల క్రితం ఓ పాత్రికేయుడు మీ సినిమా టైటిల్ ఇద‌ని ప్ర‌చారం సాగుతుంద‌ని ఆ హీరో దృష్టికి తీసుకెళ్తే ఇదేం టైటిల్ అండి ఇలా ఉందండి? అంటూ అపహేళ‌న‌గా మాట్లాడారు. అప్ప‌టి నుంచి ఆ హీరో వ‌ద్ద ఎవ‌రూ టైటిల్స్ విష‌యం డిస్క‌ష‌న్ కి తీసుకురారు. అదీ సంగ‌తి


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.