Begin typing your search above and press return to search.
నయీంగా మారడానికి చాలా కష్టపడ్డాను
By: Tupaki Desk | 8 Dec 2021 8:30 AMదాము బాలాజీ దర్శకత్వంలో నయీం డైరీస్ అనే సినిమాను తెరకెక్కింది. ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఇండస్ట్రీ వర్గాల వారితో పాటు ప్రేక్షకుల్లో కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. నయీం గురించి రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. అతడి ఎన్ కౌంటర్ కు ముందు జరిగిన నాటకీయ పరిణామాలు ఏంటీ.. అసలు నయీం ఎలాంటి వాడు.. అతడిని చంపడం న్యాయమేనా అనేది చాలా మంది చాలా రకాలుగా చర్చించుకుంటున్నారు. ఆయన తక్కువ సమయంలో వందల కోట్ల ఆస్తులను సంపాదించిన తీరు.. పోలీసులకు ఆయన చేసిన సాయాలు ఇలా ప్రతి ఒక్క విషయాలు కూడా సాదారణ జనాల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇలాంటి సమయంలో నయీం డైరీస్ దొరికాయి.. వాటిలో మరిన్ని విషయాలు ఉన్నాయి.. ఎక్కడ ఎక్కడ ఎంత డబ్బు ఉంది అనే విషయాన్ని కూడా నయీం ఆ డైరీస్ లో రాశాడు అనేది టాక్. అందుకే నయీం డైరీస్ టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.
బాలాజీ ఇంతకు ముందు కిల్లింగ్ వీరప్పన్ కు కీలక బాధ్యతలు నిర్వర్తించాడు. మాజీ నక్సలైట్ అయిన దాము బాలాజీ కథల్లో విప్లవ భావాలు ఉంటాయి. ఆయన ప్రతి ఒక్కరికి కూడా హత్తుకు పోయే కథలు రాస్తాడు అనే టాక్ ఉంది. ఈ సినిమా లో నయీం పాత్రను వశిష్ట సింహా పోషించాడు. ఇతడు కన్నడంలో పలు సినిమాల్లో నటించి మెప్పించాడు. సూపర్ హిట్ అయిన కేజీఎఫ్ లో కీలక పాత్రలో కనిపించాడు.. కేజీఎఫ్ 2 లో కూడా ఈయన కనిపించబోతున్నాడు. ఇక తెలుగు లో ఈయన పలు సినిమాల్లో నటించాడు నటిస్తున్నాడు. ఈ సమయంలో నయీం సినిమా ను చేసేందుకు ఈయన ముందుకు రావడం ఆశ్చర్యంగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి. సాదారణంగా అయితే ఇలాంటి వివాదాస్పద విషయాలపై సినిమాలు తీయడమే కష్టం.. అలాంటిది అందులో నటించేందుకు ముందుకు రావడం చాలా గొప్ప విషయం అంటారు.
ఈనెల 10వ తారీకున విడుదల కాబోతున్న నయీం డైరీస్ సినిమా ప్రమోషన్ లో భాగంగా హీరో వశిష్ట మాట్లాడుతూ.. దర్శకుడు దాము నా వద్దకు ఈ కథను పట్టుకుని వచ్చిన సమయంలో ఆశ్చర్యపోయాను. మొదట నయీం గురించి తెలుసుకునేందుకు ఇంటర్నెట్ లో సెర్చ్ చేశాను. యూట్యూబ్ లో ఎన్నో వీడియోలు చూశాను. ఆయన గురించి ఎక్కువగా చెడు అందులో ఉంది. కాని ఆయన కూడా ఒక మనిషి.. ప్రేమ పెళ్లి అతడి జీవితంలో కీలకం.. ఆయన కుటుంబం కు చాలా ప్రాముఖ్యత ఇస్తాడు.. తనను నమ్ముకున్న వారిని ఆదుకుంటూ ఉంటాడు అంటూ సినిమాలో దర్శకుడు చూపించబోతున్నారు. నయీం గురించి ఉన్న ఒక రకమైన అభిప్రాయం ఈ సినిమా తర్వాత మారుతుందనే నమ్మకం వ్యక్తం చేశాడు. ఈ సినిమాలో నటించడం కోసం నేను ఎన్నో నెలలు ఆయన గురించి తెలుసుకున్నాను. దాము స్వయంగా నక్సలైట్ అవ్వడం వల్ల ఆయన కూడా చాలా విషయాలను సేకరించాడు. అవి నాతో పంచుకునే వాడు. అలా ఎన్నో నెలలు నయీం గురించి స్టడీ చేశాం అంటూ వశిష్ట చెప్పుకొచ్చాడు. తెలుగు లో వరుసగా సినిమాలు చేయాలని ఆశ పడుతున్నట్లుగా చెప్పుకొచ్చాడు. కేజీఎఫ్ 2 లో కనిపించబోతున్నాను అని.. ముందు ముందు తెలుగు లో మరిన్ని సినిమాల్లో నటిస్తాను అన్నట్లుగా పేర్కొన్నాడు.