Begin typing your search above and press return to search.

60 వ‌య‌సులో పిచ్చిగా బ‌రువులెత్తిన హీరోగారి మ‌మ్మీ

By:  Tupaki Desk   |   25 Jan 2021 5:30 AM GMT
60 వ‌య‌సులో పిచ్చిగా బ‌రువులెత్తిన హీరోగారి మ‌మ్మీ
X
యుక్త‌వ‌య‌సులో ఎంత బ‌రువు అయినా అల‌వోక‌గా ఎత్తేస్తారు. కాస్త వ‌య‌సు పైబ‌డితేనే కండ‌రాలు ప‌ట్టేసి న‌రాలు ఇరుకున ప‌డ‌తాయి. స్థాయిని మించి జిమ్ లో బ‌రువులు ఎత్తితే అది చాలా ప్ర‌మాదం. కానీ ఇక్క‌డ ఈ భామ్మ గారి లాంటి హీరోగారి మ‌మ్మీ వేసిన ఫీట్ చూస్తుంటే షాక్ తిన‌కుండా ఉండ‌లేం. ఆవిడ 60 వ‌య‌సులో 95 కేజీల బ‌రువును ఎత్తి అలా కూల్ గా రిలాక్స‌య్యారు.

ఇంత‌కీ ఎవ‌రావిడ‌.. ఏ హీరోగారి మ‌మ్మీ? అన్న‌ది ఆరా తీస్తే.. బాలీవుడ్ కండ‌ల హీరో టైగ‌ర్ ష్రాఫ్ మ‌మ్మీ అయేషా ష్రాఫ్ ఈ బ‌రువులెత్తే ఫీట్ తో అద‌ర‌గొట్టారు. ఆమె 1960 జూన్ లో జ‌న్మించారు. ఇప్ప‌టికి 61 ఏజ్. అయినా ఎంతో సునాయాసంగా జిమ్ లో 95 కేజీల బ‌రువులు ఎత్తి శ‌హ‌భాష్ అనిపించారు. అందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా సెన్సేష‌న్ గా మారింది.

మామ్ అంత బ‌రువు ఎత్తుతుంటే ఆ ప‌క్క‌నే కొడుకు టైగ‌ర్ కూడా ఉన్నాడు. అయేషా ష్రాఫ్ జిమ్ లో 95 కిలోల బరువును డెడ్ లిఫ్టింగ్ చేయ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఆయేషా ష్రాఫ్ కొన్ని సీరియస్ ఫిట్ ‌నెస్ గోల్స్ ని యూత్ పైకి విసిరారు ఈ ఫీట్ తో.

ఈ వీడియోపై స్పందిస్తూ..., టైగర్ గర్ల్ ఫ్రెండ్ దిషా పటాని “పిచ్చి బలం” అని వ్యాఖ్యానించారు. టైగర్ ష్రాఫ్ సోదరి కృష్ణ ష్రాఫ్ “డామ్ గర్ల్ !!`` అంటూ ఎంక‌రేజ్ చేశారు. ఫిట్నెస్ ఫ్రీక్స్ అంటే టైగ‌ర్ ష్రాఫ్‌.. దిషా ప‌టానీ గుర్తొస్తారు. వారిని మించి 60ఏజ్ భామ(బామ్మ‌గారు) ఇలా చేయ‌డం షాకింగే. ప్ర‌స్తుతం టైగర్ `కాసనోవా` అనే చిత్రంలో న‌టిస్తున్నాడు. ఆ మూవీ నుండి రెండవ సింగిల్ ను విడుదల చేశాడు. త్వ‌ర‌లో `గణపత్` షూట్ కోసం సిద్ధం కానున్నాడు.