Begin typing your search above and press return to search.

2020లో నితిన్ పెళ్లి.. వ‌ధువు ఎవ‌రు?

By:  Tupaki Desk   |   12 Dec 2019 2:30 PM GMT
2020లో నితిన్ పెళ్లి.. వ‌ధువు ఎవ‌రు?
X
యంగ్ బ్యాచిల‌ర్ హీరో నితిన్ బ్ర‌హ్మ‌చ‌ర్యానికి ఫుల్ స్టాప్ ప‌డిపోనుందా.. అత‌డికి వివాహం నిశ్చ‌యం కానుందా? అంటే అవున‌నే ఫిలింన‌గ‌ర్ లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. వ‌ధువు ఓ తెలుగ‌మ్మాయి.. 2020 ఏప్రిల్ లో ఈ జంట పెళ్లి జ‌ర‌గ‌నుంద‌న్న వార్త గుప్పుమంది.

నితిన్ కొంత‌కాలంగా స‌ద‌రు తెలుగ‌మ్మాయితో ప్రేమ‌లో ఉన్నాడ‌ట‌. ఆ అమ్మాయికి సినీప‌రిశ్ర‌మ‌తో ఎలాంటి సంబంధం లేద‌ని తెలుస్తోంది. అయితే నితిన్ పెళ్లికి సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్ర‌క‌ట‌నా వెలువ‌డ‌లేదు. వ‌ధువు ఎవ‌రు.. ఏం చేస్తుంది? త‌దిత‌ర వివ‌రాలు వెల్ల‌డి కావాల్సి ఉంది.

మ‌రోవైపు కెరీర్ ప‌రంగా చూస్తే.. నితిన్ ప్ర‌స్తుతం వ‌రుస‌గా సినిమాల్లో న‌టిస్తున్నాడు. అత‌డు న‌టించిన భీష్మ త్వ‌ర‌లో రిలీజ్ కి రానుంది. ఇదివ‌ర‌కూ రిలీజైన టీజ‌ర్ కి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. మ‌రోవైపు రంగ్ దే స‌హా ప‌లు క్రేజీ చిత్రాల్లో నితిన్ న‌టించ‌నున్నాడు.