హిట్ 2 అంచనాలకు ఏమాత్రం తగ్గదంటున్న నాని..!

Tue Nov 29 2022 10:49:31 GMT+0530 (India Standard Time)

Hero Nani About HIT2 Movie

నేచురల్ స్టార్ నాని నిర్మాతగా కూడా తన అభిరుచిని తెలియ చేస్తున్నారు. ఓ పక్క వరుస మూవీస్ చేస్తూనే.. మరోపక్క వాల్ పోస్టర్ బ్యానర్ ఫై మూవీస్ ను నిర్మిస్తూ సక్సెస్లు అందుకుంటున్నారు. తాజాగా హిట్ మూవీకి సీక్వెల్ గా హిట్ 2 ను నిర్మించారు. ఈ సినిమాలో యంగ్ హీరో అడివి శేష్ హీరోగా నటించగా.. దర్శకుడు శైలేష్ ఈ మూవీని పూర్తి క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కించాడు. రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ ట్రైలర్లు ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచాయి వాటికి తోడుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు దర్శక ధీరుడు రాజమౌళి హాజరై సినిమాకు మరింత క్రేజ్ వచ్చేలా చేశారు.హిట్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాని మాట్లాడుతూ.. ఈ ఫంక్షన్ వచ్చిన వారందరికీ థాంక్స్. వల్లి గారు .. రమా గారు వస్తే మా అమ్మ .. పిన్నీ వచ్చినట్టుగా అనిపిస్తోంది. రాజమౌళిగారు ప్రపంచమంతా తిరిగేసి ఈ రోజునే దిగారు.. అయినా పిలవగానే వచ్చారు. రాజమౌళిగారు నా ప్రొడక్షన్ లో వచ్చే సినిమాలకు తప్పకుండా వస్తారు.

ఆయన్ని ఇబ్బంది పెట్టాలని ఉండదు.. కానీ ఇబ్బంది పెడుతూనే ఉంటాను. రాజమౌళిగారు ఈ మధ్య చాలా స్టైల్ గా కనిపిస్తున్నారు. సూట్ వేసుకున్న ఆయన్ని చూసి షాక్ అయ్యానని అన్నారు నాని. జేమ్స్ బాండ్ లా ఉన్నారని మెసేజ్ చేశా.

ఆయన పక్కన కార్తికేయ అసలు కనిపించలేదు. ఆయన సినిమాలో హీరో ఎవరా అని అంతా ఎదురుచూస్తుంటారు. కానీ నేను మాత్రం ఆయన సినిమాలో ఆయన హీరోగా ఎప్పుడు చేస్తారా అని చూస్తున్నానాని అన్నారు నాని.

ఈ మూవీ లో అడివి శేష్ అద్భుతంగా చేశాడు.. ప్రేక్షకుల ఇంటెలిజెన్స్ ని తక్కువ చేయకుండా ఇది సరిపోదు అనుకుంటూ అలా సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. సినిమా కోసం కష్టపడుతూ చివరిదాకా నటిస్తూ ఉండే ఒక యాక్టర్ అడివి శేష్. ఇక అలాంటి నటుడికి శైలేష్ లాంటి డైరక్టర్ తొడవడం తో ఒక మంచి అవుట్ పుట్ వచ్చింది.

శైలేష్ ఈ మూవీని గొప్పగా తీశాడు. హిట్ 1 2 ఇలా హిట్ 7 వరకూ తీసుకుని వెళతానని తాను చెప్పాడు. హిట్ 7 లో అప్పటివరకూ పోలీస్ ఆఫీసర్స్ గా చేసిన హీరోలందరూ కనిపించేలా ఆ పాత్రలను కలుపుతూ చేస్తానని అన్నాడు. హిట్ 3లో హీరో ఎవరనేది  హిట్ 2లో తెలస్తుందని అన్నారు నాని. ఈ సినిమా తప్పకుండా అంచనాలకు తగినట్టుగానే ఉంటుందని సినిమా చూసి ఎలా ఉందో చెప్పాలని ప్రేక్షకులను కోరారు నానినోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.