మెగాపవర్ స్టార్ తో హీరో ప్రయాణం మొదలైందిగా!

Fri Sep 30 2022 16:01:26 GMT+0530 (India Standard Time)

Hero More Brand with Megapower Star!

'ఆర్ ఆర్ ఆర్' హిట్ తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రేంజ్ పాన్ ఇండియాని తాకుతోన్న సంగతి తెలిసిందే. చరణ్ ఇప్పుడు మార్కెట్ లో రెట్టింపు ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు. బాలీవుడ్...హాలీవుడ్ అంటూ శిఖరాలకు చేరుకుంటోన్న తరుణమిది. అందుకే ఎండార్స్ మెంట్ పరంగా వచ్చిన ఏ అవకాశాన్ని విడిచిపెట్టడం లేదు. కోట్ల రూపాయల పారితోషికాన్ని  బ్రాండింగ్  చేస్తూ అందుకుంటున్నాడు.టాలీవుడ్ లో మహేష్..బన్నీ తర్వాత అత్యధిక బ్రాండింగ్స్ చేస్తోన్న స్టార్ గా చరణ్ కి పేరుంది. తాజాగా మోటార్ సైకిల్ కంపెనీ హీరోకి బ్రాండ్ అంబాసిడర్ గానూ టర్న్ అయినట్లు తెలుస్తోంది. తాజాగా చరణ్ చేసిన వాణిజ్య ప్రకటనని సదరు కంపెనీ రిలీజ్ చేసింది. ఇందులో హీరో హెల్మెట్ ధరించి బైక్ డ్రైవ్ చేస్తున్నారు. అతడు నెక్సస్ బ్లూ కలర్ గ్లామర్  ఎక్స్ టెక్ బైక్ రైడ్ చేయడం చూడవచ్చు.

రైడింగ్ చేస్తున్న సమయంలో ఈ బైక్ లోని ఫీచర్స్ గురించి  చెబుతున్నారు. ఈ సందర్భంగా కంపెనీ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ మాట్లాడుతూ " భారతదేశంలో ప్రఖ్యాత నటుడిగా గుర్తింపు పొందిన రామ్ చరణ్‌తో అనుబంధంతో కంపెనీ మరింత ముందుకు వెళ్తుంది. భవిష్యత్ లో  మరిన్ని టెలివిజన్ ప్రచారాలలో రామ్ చరణ్ తో మరింత లోతైన సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి  ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.

మొత్తానికి చరణ్ తో హీరో ప్రయాణంలో భవిష్యత్  లోనూ కొనసాగుతుందని  తెలుస్తోంది. ఇప్పటికే చరణ్ పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. చిన్న..పెద్దా అనే తారతమ్యం లేకుండా తన దగ్గరకు వచ్చినా ఏ కంపెనీని విడిచిపెట్టడం లేదు. పాన్ ఇండియాస్టార్ గా అవతరించిన తర్వాత మరింత వేగం పెంచారు.

ఇక చరణ్ సినిమాల సంగతి చూస్తే ప్రస్తుతం తన 15వ చిత్రాన్ని శంకర్ దర్శకత్వంలో చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తిచేసుకుంది. బ్యాలెన్స్ షూటింగ్   వీలైనంత త్వరగా పూర్తిచేయాలని సన్నాహాలు చేస్తున్నారు.

అలాగే కొత్త ప్రాజెక్ట్ ల విషమయంలో చరణ్ ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. గౌతమ్ తిన్ననూరితో చేయాల్సిన సినిమా ఆగిపోయిందని ప్రచారం సాగుతోంది. అయితే అందులో వాస్తవాలు తెలియాల్సి ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.