ఇప్పటికైనా హీరోయిన్స్ తో జాగ్రత్తగా నడుచుకో హీరో..!

Wed Nov 25 2020 08:00:01 GMT+0530 (IST)

Still be careful with the heroines Hero ..!

ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూకుడు మీదున్న ఓ హీరో కారణంగా.. హీరోయిన్లు ఇబ్బందులు పడుతుంటారనే కామెంట్స్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంటాయి. గతంలో ఓ వివాదాస్పద నటి కూడా సదరు హీరో పై లైంగిక ఆరోపణలు చేసింది. కాకపోతే అభిమానుల్లో హీరోకి మంచి బాలుడు అనే ట్యాగ్ లైన్ ఉండటం వల్ల ఆ విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఇదే క్రమంలో తనతో ఓ హిట్ సినిమాలో నటించిన హీరోయిన్ ని కూడా తెగ ఇబ్బంది పెట్టడంతో షూటింగ్ కి అవాంతరాలు ఏర్పడ్డాయని అప్పట్లో పుకార్లు షికార్లు చేశాయి. ఇప్పుడు తాజాగా తన సినిమాతో మరో హీరోయిన్ టాలీవుడ్ కి పరిచయం అవుతున్న నేపథ్యంలో సదరు హీరో బిహేవియర్ ఎలా ఉంటుందో అని అందరూ మాట్లాడుకుంటున్నారు.నిజానికి హీరో చేస్తున్న ఇలాంటి వ్యవహారాల వల్ల అప్పట్లో అతని వైవాహిక జీవితం కూడా సరిగ్గా లేదని టాక్ నడిచింది. ఈ గొడవల నుంచి అతనిని ఎప్పటికప్పుడు టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ ఒకరు బయటపడేస్తున్నట్లు ఫిలిం సర్కిల్స్ లో అనుకుంటుంటారు. ఇప్పటికే ఆ హీరోతో పలు సినిమాలు చేసిన సదరు నిర్మాత అతనితో మంచి సంబంధాలు కొనసాగిస్తుంటారు. ఈ మధ్య ఓ సినిమా రిలీజ్ విషయంలో కూడా వీరి మధ్య అండర్స్టాండింగ్ బయటపడిందని టాక్ నడిచింది. ఈ క్రమంలో ఆ హీరో లేటెస్టుగా అనౌన్స్ చేసిన సినిమాతో ఓ టాలెంటెడ్ హీరోయిన్ టాలీవుడ్ కి పరిచయం అవుతోంది. ఇప్పుడు ఆమెతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని సన్నిహితులు అందరూ హీరోకి సలహా ఇస్తున్నారని సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.

TAGS: Hero