ఆ చెవులకు కంకణాల లోలాకులు అదరహో హెబ్బా

Thu May 13 2021 06:00:01 GMT+0530 (IST)

Hebba Patel Latest Photo

లేటెస్ట్ ఫ్యాషన్స్ అండ్ ట్రెండ్ ని ఫాలో చేయడంలో నేటితరం కథానాయికల తీరుతెన్నులే వేరు. ఎందులోనూ ఔత్సాహిక నటీమణులు తగ్గడం లేదు. ఇక టాలీవుడ్ లో ఆరేడేళ్లుగా సినిమాల్లో నటిస్తూ కెరీర్ జర్నీ సాగిస్తున్న హెబ్బా పటేల్ నిరంతరం ఏదో ఒక ట్రెండీ లుక్ ని సోషల్ మీడియాల్లో షేర్ చేస్తూనే ఉంది. ఈ ముంబై బ్యూటీ ఎవ్వర్ లేటెస్ట్ డిజైనర్ లుక్ ని అమితంగా ప్రేమిస్తుంది.తాజాగా ఓ స్పెషల్ డిజైనర్ డ్రెస్ లో హెబ్బా పటేల్ అందచందాలు అభిమానులను ఆకర్షిస్తున్నాయి. హెబ్బా డిజైనర్ టాప్.. దానికి పూల గుత్తి డిజైన్ .. నడుముకు వడ్డానం ఫ్లవరిష్ గుత్తి స్టైల్ .. ఇది అద్బుతమైన డిజైనర్ లుక్ అనే చెప్పాలి. ముఖ్యంగా ఆ చెవులకు కంకణాల లోలాకులతో ఎంతో స్పెషల్ గా కనిపిస్తోంది. ముత్యాలతో తయారు చేసిన కంకణాల లోలాకులు ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి.

కుమారి 21 ఎఫ్- ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి బ్లాక్ బస్టర్లలో నటించిన హెబ్బా కు ఇటీవల సక్సెస్ దక్కలేదు. రామ్ రెడ్ చిత్రంలో స్పెషల్ నంబర్ లో మెరిసిన హెబ్బా .. ఓదెలా రైల్వే స్టేషన్.. తెలిసినవాళ్లు అనే రెండు చిత్రాల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఇవి చిత్రీకరణల్లో ఉన్నాయి.