Begin typing your search above and press return to search.

రెడ్ వేదిక‌పై గుండె కొల్ల‌గొట్టిన‌ పింక్ చీర‌

By:  Tupaki Desk   |   13 Jan 2021 5:03 AM GMT
రెడ్ వేదిక‌పై గుండె కొల్ల‌గొట్టిన‌ పింక్ చీర‌
X
ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన తాజా చిత్రం రెడ్. నివేద పెథురాజ్-మాళ‌విక శ‌ర్మ క‌థానాయిక‌లు. కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌కుడు. స్ర‌వంతి ర‌వికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రామ్ ద్విపాత్రాభిన‌యం చేసిన ఈ సినిమా సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న తెలుగు రాష్ట్రాలు స‌హా ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌వుతోంది.

తాజాగా ప్రీరిలీజ్ ఈవెంట్ లో చిత్ర‌బృందం సంద‌డి చేసింది. ఈ వేదిక‌పై ఇద్ద‌రు నాయిక‌‌లు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణగా నిలిచారు. భామామ‌ణుల్లో నివేద‌ రెడ్ డిజైన‌ర్ డ్రెస్ లో క‌నిపిస్తే.. మాళ‌విక మాత్రం పింక్ చీర‌లో గుబులు రేపింది. స్లీవ్ లెస్ బ్లౌజ్ .. సాంప్ర‌దాయ‌క చీర క‌ట్టు‌లో అమ్మ‌డి అందం ప‌దింత‌లైంది.

తొలి నుంచి రెడ్ ప్ర‌మోష‌న్స్ లో మాళ‌విక‌నే హైలైట్ గా క‌నిపిస్తోంది. ఇప్పుడు పింక్ చీర‌తో గుండె కొల్ల‌గొట్టేసింది. రెడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ అయితే ఈ అమ్మ‌డికి వ‌రుస గా ఆఫ‌ర్లు రావ‌డం ఖాయ‌మే. ఇంత‌కుముందు డిజాస్ట‌ర్ మూవీ `నేల టిక్కెట్టు`లో న‌టించిన మాళ‌విక‌.. ఆ త‌ర్వాత టాలీవుడ్ లో పెద్ద రేంజ్ కెరీర్ కోసం వేచి చూస్తోంది. ఇక నివేద `అల వైకుంఠ‌పుర‌ములో` బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించాక‌.. ఇప్ప‌టికే టాలీవుడ్ లో కెరీర్ ప‌రంగా బిజీ అయిన సంగ‌తి తెలిసిందే.