Begin typing your search above and press return to search.

గుండెల్ని హత్తుకునే మాస్ సినిమా చూపిస్తా: నాని

By:  Tupaki Desk   |   27 March 2023 10:11 AM GMT
గుండెల్ని హత్తుకునే మాస్ సినిమా చూపిస్తా: నాని
X
నాచురల్ స్టార్ నాని హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్ గా పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న సినిమా దసరా గురించి అందరికీ తెలిసిందే. అయితే దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ విడుదలకానున్న ఈ చిత్రానికి సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. పక్కా మాస్ మసాలా ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి భారీగా బడ్జెట్ పెట్టి నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణ సంగీతం అందిస్తున్నారు. ఈ క్రమంలోనే చిత్ర ప్రమోషన్లలో హీరో హీరోయిన్లు చాలా బిజీగా గడుపుతున్నారు. రోజుకో రకంగా దసరా సినిమా ప్రమోషన్స్ చేస్తూ ఆభిమానుల్లో ఆసక్తిని క్రియేట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే దసరా సినిమా ప్రమోషన్స్‌లో నాని చేసిన ఒక్కో వ్యాఖ్య విపరీతంగా ఆకర్షిస్తోంది.

సీడెడ్ అంటే రాయలసీమ, పక్కా మాస్ అని.. ఇది అంతకు మించిన మాస్ చిత్రం అని నాని తెలిపారు. ఇన్నాళ్లూ మీరు మెప్పించే మాస్ చిత్రం చూసి ఉంటారు కానీ.. ఇప్పుడు మిమ్మల్ని మెప్పించే మాస్ చిత్రాన్ని చూస్తారు అంటూ ప్రామిస్ చేశారు.

మాస్ చూసి విజిల్స్ వేసి ఉంటాం కానీ.. మాస్ చూసి కంటతడి పెట్టే సినిమాను నేను చూపిస్తానంటూ కామెంట్లు చేశాడు. దసరా సినిమా మీ మనుసును కచ్చితంగా హత్తుకుంటుందని నాని హామీ ఇచ్చాడు.

చిత్రబృందం మొత్తం ఈ సినిమాకు ఏడాది పాటు చాలా కష్టపడ్డట్లు తెలిపారు. దుమ్ములో, దూళిలోనే చాలా రోజులు గడిపినట్లు వెల్లడించారు. అలాగే సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ నాని థాంక్స్ చెప్పారు. తను థాంక్స్ చెప్పుకోవడానికి ఉన్న ఒక్కగానొక్క ప్లేస్ ఇదంటూ వివరించారు.

నాని, కీర్తి సురేష్ లు హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్ వంటి వారు కీలక పాత్రలో నటిస్తున్నారు. సత్యం సూర్య సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ చేస్తున్నారు. మార్చి 30వ తేదీన దేశవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కరీంనగర్ జిల్లాలోని గోదావరిఖని సింగరేణి వద్ద జరిగింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.