Begin typing your search above and press return to search.

ఆయనే అసలైన హీరో.. అది చూసి ఫోన్ పగలగొట్టా : రామ్

By:  Tupaki Desk   |   13 Jan 2021 5:10 AM GMT
ఆయనే అసలైన హీరో.. అది చూసి ఫోన్ పగలగొట్టా : రామ్
X
ఎనర్జిటిక్ హీరో రామ్ లేటెస్ట్ మూవీ RED. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 12 నిర్వహించారు. దర్శకుడు త్రివిక్రమ్ ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా భావోద్వేగమైన స్పీచ్ ఇచ్చాడు.

వారిపై గౌరవం పెరిగింది..

తనకు సినిమా రచయితలపై గౌరవం పెరిగిందని, అది కూడా త్రివిక్రమ్ గారి వల్లేనని అన్నాడు. ‘చిన్నప్పుడు పెదనాన్న గారు వచ్చి నువ్ నాకు నచ్చావ్ సినిమా సీన్స్, డైలాగ్స్ చెప్పాడు.. అప్పుడే సినిమా చూసేయాలన్నా కోరిక పుట్టింది. అప్పుడే రైటర్స్ పై గౌరవం పెరిగింది. సినిమాపై వారి ప్రభావం, పెన్ను పవర్ నాకు అర్థమైంది. ఇదంతా త్రివిక్రమ్ వల్లే’ అన్నాడు రామ్.

ఈ సినిమా హీరో ఆయనే..

‘రెడ్’ సినిమాకు సంబంధించి నిర్మాత శ్రవంతి రవికిశోర్ హీరో అన్నాడు రామ్. ‘మా పెదనాన్నే హీరో. ఈ లాక్డౌన్ మొత్తంలో ఆయన నాకు భజరంగీ భాయిజాన్ సినిమాలో పాప చేతిని పట్టుకున్న సల్మాన్ ఖాన్‌లా కనిపించాడు. ఎన్ని ఓటీటీ ఆఫర్లు వచ్చినా కూడా సినిమాను థియేటర్‌లో రిలీజ్ చేస్తామని పట్టుబట్టారు. అందుకే ఇప్పుడు ఇలా ఇక్కడి వరకు వచ్చింది. లేదంటే సినిమా ఎప్పుడో ఓటీటీల్లో వచ్చేది. అందుకే ఈ సినిమాకు ఆయనే హీరో’ అని చెప్పుకొచ్చాడు రామ్.

దర్శకుడిని వద్దన్నారు..

రెండ్ సినిమా చేసేప్పుడు దర్శకుడిని మార్చాలని చెప్పారని రామ్ అన్నాడు. ‘అందరూ ఈ సినిమాకు కిషోర్ తిరుమలను ఎందుకు తీసుకున్నారని అడిగారు. కానీ నాకు కిషోర్ గురించి అంతా తెలుసు. ఆయన ఎలాంటి పాత్రలనైనా సమర్థవంతంగా తెరకెక్కించగలడు. మాస్ సినిమా కూడా తీయగలడు.’ అంటూ.. రెడ్ దర్శకుడిని ప్రశంసించాడు రామ్.

అప్పుడు ఫోన్ పగలగొట్టాను..

‘హలో గురు ప్రేమ కోసమే సినిమా టైంలో నాకు 104 డిగ్రీల జ్వరం వచ్చింది. అందరూ షూట్ వద్దన్నారు. నేను మాత్రం చేద్దామని సాంగ్ షూట్ కోసం రిహార్సల్స్ చేస్తున్నాను. కానీ.. చేయలేకపోతున్నాను. దీంతో కాసేపు కూర్చొని ట్విట్టర్ ఓపెన్ చేశాను. ‘అన్నా సినిమాలో డ్యాన్స్‌లు మాత్రం చించేయాలి’ అని ఒకరు కామెంట్ పెట్టారు. ఆ కామెంట్ చూసి ఫోన్ విసిరికొట్టాను. శక్తి తెచ్చుకొని ఫుల్ ఎనర్జీతో డ్యాన్స్ చేసేశాను’ అన్నాడు రామ్. తనను ఎనర్జిటిక్ హీరో అంటుంటారని, అంత ఎనర్జీ ఎక్కడిదంటే.. అది ఫ్యాన్స్ వేసే ఈలలు, గోల నుంచే వస్తుందని చెప్పుకొచ్చాడు.