ఇండియాలోనే మోస్ట్ బిజీ యాక్టర్ ఈయన

Fri Jun 18 2021 14:00:01 GMT+0530 (IST)

He is the busiest actor in India

హీరోలు ఈ మద్య కాలంలో ఒక సినిమా తర్వాత ఒకటి అన్నట్లుగా చేస్తూ వస్తున్నారు. కొద్ది మంది మాత్రం ఏడాదికి రెండు మూడు సినిమాలు చేస్తూ ఉన్నారు. ఒకే సమయంలో రెండు మూడు సినిమాలు చేస్తూ ఉన్న హీరోలు అతి తక్కువ మంది ఉన్నారు. ఇక క్యారెక్టర్ ఆర్టిస్టు అయినా కూడా అయిదు నుండి పది సినిమాలు ఒకే సారి చేస్తారు. ఇక విలన్ పాత్రల్లో నటించే వారు కూడా అంతకు మించి ఎక్కువ సినిమాలు చేయలేరు. ఇక హీరోయిన్స్ అయితే ఒకే సారి అయిదు ఆరు సినిమాలు చేయగలరు. కాని ఒకేసారి పాతిక ప్రాజెక్ట్ లు చేస్తున్న స్టార్ మాత్రం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఏ ఒక్కరు లేకపోవచ్చు.ప్రస్తుతం తమిళం.. తెలుగు.. హిందీ ఇంకా ఇతర భాషల్లో కూడా విజయ్ సేతుపతి సినిమాలు చేస్తున్నాడు. పదుల సంఖ్యలో సినిమాలు మేకింగ్ దశలో ఉన్నాయి. కొన్ని చర్చల దశలో ఉన్నాయి. సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లు కూడా ఈయన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. టీవీ షో లు వెబ్ షో లు ఇలా అన్ని కలిపి విజయ్ సేతుపతి చేతిలో ఏకంగా పాతిక ప్రాజెక్ట్ లు ఉన్నాయి. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఏ స్టార్ హీరో కాని నటుడు కాని హీరోయిన్ కాని ఒకే సమయంలో ఇన్ని ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నదే లేదు.

విజయ్ సేతుపతి ప్రస్తుతం కొన్ని సినిమాలను కూడా సొంతంగా నిర్మిస్తున్నాడు. ఆయన తాను నటిస్తున్న సినిమాలకు కాకుండా ఇతర సినిమా లకు కూడా రచన సహకారం అందిస్తూ ఉంటాడు. మొత్తానికి విజయ్ సేతుపతి సినిమాకు సంబంధించిన అన్ని విభాగాలపై పట్టు సారించడంతో పాటు నటుడిగా ఇండియాలోనే ఏ నటుడు చేయనన్ని సినిమాలు ఒకే సారి చేస్తూ అరుదైన రికార్డున సొంతం చేసుకున్నాడు.