వెంకీని వరుణ్ మ్యాచ్ చేయగలడా?

Thu Dec 13 2018 14:08:03 GMT+0530 (IST)

Has Varun Tej Not Match With Venkatesh

సీనియర్ హీరో వెంకటేష్.. మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ కాంబినేషన్ లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టి స్టారర్ 'F2'.  సంక్రాంతి కి రిలీజ్ కానున్న ఈ సినిమా టీజర్ నిన్నే రిలీజ్ అయింది. సినిమా ఎంత కామెడీగా ఉండబోతోందో టీజర్ తో శాంపిల్  చూపించాడు దర్శకుడు.  పెళ్ళికి ముందు మగవాళ్ళు ఏమనుకుంటారు.. పెళ్ళైన తర్వాత ఎం తెలుసుకుంటారు అనేది ఇద్దరు హీరోలు వెంకీ.. వరుణ్ పాత్రల ద్వారా చూపించాడు. అనుకున్నదంతా జరగదని.. ఊహించని ఝలక్కులతో 'వెంకీ ఆసన్' వెయ్యాల్సి వస్తుందని సింబాలిక్ గా చెప్పాడు. మొగుళ్ళుగా మగసమాజం పడుతున్న బాధలను ఫన్ కోసం  అనిల్ రావిపూడి. బాగానే వాడుకున్నాడు.  కాన్సెప్ట్ బాగుంది.. వెంకీ కామెడీ టైమింగ్ సంగతి అందరికీ తెలిసిందే.  కామెడీ కి ఇంత స్కోప్ ఉన్న పాత్ర దొరికితే విశ్వరూపం చూపిస్తాడనడం లో ఏ మాత్రం సందేహం లేదు.  కానీ కామెడీ టైమింగ్ విషయం లో వెంకీ ని  వరుణ్ తేజ్ అందుకోగలడా అని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇద్దరూ తోడల్లుళ్ళు కాబట్టి..  దాదాపు వెంకీ వరుణ్ కాంబినేషన్ లో ఎక్కువ కామెడీ సీన్స్ ఉండే అవకాశం ఉంది.  దీంతో వరుణ్ టైమింగ్ సరిగా లేకపోతే కామెడీ పండే అవకాశం తక్కువని వారి వాదన వినిపిస్తున్నారు. ఒకరకంగా ఆలోచిస్తే అదీ నిజమే కదా అనిపిస్తుంది.  వరుణ్ తన కెరీర్ లో ఇప్పటివరకూ అన్నీ సీరియస్ పాత్రల్లోనే నటించాడు.. కామెడీ కి స్కోప్ ఉన్న పాత్రలు చెయ్యలేదు.  పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'లోఫర్' సినిమాలో కాస్త కామెడీ టచ్ ఉంటుంది కానీ ఆ సీన్లలో పోసాని ఫుల్ గా డామినేట్ చేశాడు. ఇప్పుడు వెంకీ లాంటి సూపర్బ్ కామెడీ టైమింగ్ ఉన్న నటుడి తో కలిసి నటించే సమయంలో కనీసం 75% -  80% అయినా మ్యాచ్ చేస్తే గానీ ఆ సీన్లు పండే అవకాశం లేదు.

 మరి వెంకీ టైమింగ్ ను వరుణ్ అందుకోగలడా లేదా అనేది తెలియాలంటే మనం సంక్రాంతి వరకూ వేచి చూడాల్సిందే.  ఒకవేళ వరుణ్ వెంకీ ని మ్యాచ్ చేయగలిగితే మాత్రం సినిమా ప్రేక్షకులను ఫుల్ గా ఇంప్రెస్ చేయడం ఖాయమే .