ఆర్ యు టామీ.. మిల్కీ కొత్త పేరు

Tue Jan 22 2019 10:22:42 GMT+0530 (IST)

Has Tamannah Nick Name R U Taamy

నాలుగు దక్షిణాది భాషల్లో క్వీన్ రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. తెలుగు తమిళం మలయాళం కన్నడంలో నలుగురు భామలు క్వీన్స్ గా నటిస్తున్నారు. తెలుగులో తమన్నా (దటీజ్ మహాలక్ష్మి) తమిళంలో కాజల్ (పారిస్ పారిస్) కన్నడంలో పారుల్ యాదవ్ మలయాళంలో మాంజిమ టైటిల్ పాత్రలు పోషిస్తున్నారు. వీళ్లందరినీ ఒకే వేదికపైకి తెచ్చి క్వీన్ రీమేక్ చిత్రాలకు ప్రచారం చేస్తున్నారు. త్వరలో అన్ని భాషల్లో అన్ని వెర్షన్ల సినిమాలు రిలీజవుతున్నాయి. ఈ సందర్భంగా ప్రచారంలోనూ వేడి పెంచారు. ప్రస్తుతం క్వీన్స్ ప్రచారార్భాటంపై యూత్ లో ఆసక్తికర చర్చ సాగుతోంది.క్వీన్ సినిమా పుణ్యమా అని కాజల్- తమన్నా- పారుల్- మాంజిమ మధ్య స్నేహం బాగానే కుదిరింది. ముఖ్యంగా కాజల్ - తమన్నా ఒకరిని వదిలి ఒకరు ఉండలేనంత గొప్ప స్నేహితులు అయిపోయారు. మిల్కీ అంటే కాజల్ కి అభిమానం.. కాజల్ అంటే మిల్కీకి అంతే ప్రేమాభిమానం. ఈ సంగతి తాజాగా ఓ యూట్యూబ్ చానెల్ ఇంటర్వ్యూలో బయటపడింది.

ఈ ఇంటర్వ్యూలో చందమామ కాజల్ యాథాలాపంగానే `టామీ` అంటూ ముద్దుగా తమన్నాని పిలిచేసింది. అవునా.. తన పేరు టామీనా? అంటూ టీవీ హోస్ట్ అనుపమ్ చోప్రా అంతే సర్ ప్రైజ్ అయ్యింది. ఇక ఆంధ్రప్రదేశ్ లోని ఓ మారుమూల విలేజ్ కి వెళ్లారట ఈ ముంబై భామలిద్దరూ. అసలేమాత్రం సంబంధం లేని చోట తమకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి ఆశ్చర్యపోయామని చెప్పారు. అవార్డులు రివార్డుల కన్నా డబ్బు కన్నా ఎంతో ఆనందాన్నిచ్చేది ఈ అభిమానమేనని కాజల్ ముచ్చటగా చెప్పింది. ఈ షోలో కాజల్ తమన్నా ఒకరినొకరు పొగిడేసుకోవడం ఇంట్రెస్టింగ్. ఈ టాక్ షో లో మలయాళీ వెర్షన్ క్వీన్ మాంజిమ మాత్రం మిస్సయ్యింది.