Begin typing your search above and press return to search.

రానా- మిహీక పెళ్లి గెస్టులకు ముందే టెస్టులు?

By:  Tupaki Desk   |   4 Aug 2020 7:30 AM GMT
రానా- మిహీక పెళ్లి గెస్టులకు ముందే టెస్టులు?
X
టాలీవుడ్ హంక్ రానా ద‌గ్గుబాటి వివాహానికి ఏర్పాట్లు ప్ర‌త్యేక నిబంధ‌న‌ల ప్ర‌కారం సాఫీగా సాగుతున్నాయి. కోవిడ్ నియ‌మ నిబంధ‌న‌ల వ‌ల్ల ఈ వివాహం కూడా ఇత‌ర సెలబ్రిటీ వెడ్డింగ్స్‌ త‌ర‌హాలోనే సింపుల్ గా కుటుంబీకులు కొద్దిమంది బంధుమిత్రుల స‌మ‌క్షంలో జ‌ర‌గ‌నుంది. ఆగ‌స్టు 8 ముహూర్తం నిర్ణ‌యించిన సంగతి తెలిసిందే. రానా- మిహీక జంట ప్రీప్రిప‌రేష‌న్స్ లో బిజీ బిజీ.

అదంతా స‌రే కానీ.. ఈ వివాహం హైద‌రాబాద్ పాత బ‌స్తీలోని ఫ‌ల‌క్ నుమా ప్యాలెస్ లో కాస్త రిచ్ గా జ‌రుగుతుంద‌ని ఇంత‌కుముందు ప్రచార‌మైంది. కానీ ఆ త‌ర్వాత వెన్యూ మారిందిట‌. హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియోస్ లో ఈ జంట వివాహం జ‌ర‌గ‌నుంది. స్టూడియోలో కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నార‌ని స‌మాచారం. నూతన వధూవరులను ఆశీర్వదించడానికి ఈ సందర్భంగా కేవ‌లం కుటుంబ స‌భ్యులు స‌హా 30 మంది అతిథులు మాత్రమే హాజరవుతారు. హైదరాబాద్ ‌లో అంత‌కంత‌కు పెరుగుతున్న కొరోనా వైరస్ పాజిటివ్ కేసుల దృష్ట్యా చాలానే జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నార‌ట‌.

అలాగే వివాహ వేదికను బయో-సేఫ్టీ బబుల్ గా మార్చడానికి ఇరు కుటుంబాలు ప్రణాళికలు సిద్ధం చేశాయని స‌మాచారం. కోవిడ్ సోక‌కుండా అన్ని భద్రతా నియ‌మాలు పాటించ‌నున్నారు. పెళ్లికి వ‌చ్చే ప్రతి అతిథికి కోవిడ్ టెస్టులు చేయిస్తున్నార‌ని స‌మాచారం. అలాగే వేదిక అంతటా శానిటైజర్లను అందుబాటులో ఉంచుతారు. సామాజిక దూరం తప్ప‌నిస‌రి. ఇక రానా పెళ్లిలో ప్ర‌భాస్- రామ్ చ‌ర‌ణ్‌- వ‌రుణ్ తేజ్- రాజ‌మౌళి- ఆర్కా స‌భ్యులు స‌హా ప‌లువురు ప్ర‌ముఖులు సంద‌డి చేసే వీలుంద‌ని తెలుస్తోంది.