చిరు 'భోళా శంకర్' లో అక్కినేని హీరో!

Fri Mar 17 2023 18:11:27 GMT+0530 (India Standard Time)

Akkineni Hero in Bhola Shankar Film

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే. చిరంజీవికి సోదరి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. చిరంజీవి మరియు కీర్తి సురేష్ కాంబోలో వచ్చే అన్నా చెల్లి సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఉంటాయని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.ఈ సినిమాలో కీర్తి సురేష్ కు ప్రియుడి పాత్రలో అక్కినేని హీరో సుశాంత్ నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. హీరోగా పలు సినిమాల్లో నటించి కమర్షియల్ సక్సెస్ లను దక్కించుకోలేక పోయిన సుశాంత్ ఈమధ్య కాలంలో వరుసగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇతర హీరోల సినిమాల్లో నటిస్తున్న విషయం తెల్సిందే.

భోళా శంకర్ సినిమాలో సుశాంత్ పాత్ర ను మొదట అనుకున్నదాని కంటే కాస్త ఎక్కువ చేశారని తెలుస్తోంది. సుశాంత్ పుట్టిన రోజు సందర్భంగా భోళా శంకర్ యూనిట్ సభ్యులు ప్రత్యేకంగా పోస్టర్ ను విడుదల చేసి శుభాకాంక్షలు తెలియజేయనున్నారట.

మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉంటుందనే నమ్మకాన్ని యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. అతి త్వరలోనే సినిమా చిత్రీకరణ ముగించి దసరా కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని భావిస్తున్నారు.

చిరంజీవి గత చిత్రం వాల్తేరు వీరయ్య భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం వల్ల ఈ సినిమా తో మరో విజయాన్ని దక్కించుకోవడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా దర్శకుడు మెహర్ రమేష్ ఈ సినిమాను రూపొందిస్తున్నాడట.   


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.