జైల్లోనే అంధత్వం.. చావుకు దగ్గరగా వేధింపుల నిర్మాత

Sun Oct 18 2020 05:00:05 GMT+0530 (IST)

Blindness in jail .. Producer of harassment close to death

మీటూ ఉద్యమ పర్యవసానం ఎంతమందిపై పడింది? అన్నది అటుంచితే ఆ ప్రముఖ నటుడు కం నిర్మాత చావు వరకూ తెస్తోంది. ఆయన ఇప్పటికే జైల్లో గుడ్డివాడైపోయాడు. ఇంకా విడిచిపెట్టకపోతే చావుకు దగ్గరవుతాడన్న ఆందోళనా వ్యక్తమవుతోంది. ఇంతకీ ఎవరాయన? అంటే హార్వే వీన్ స్టీన్. హాలీవుడ్ లో ప్రముఖ నిర్మాత కం నటుడు. గత రెండేళ్లుగా ప్రముఖంగా వార్తా కథనాల్లో వెలుగు చూసిన పేరు ఇది.హార్వీ వీన్ స్టీన్ (68) న్యాయవాదులు తాజా ప్రకటనలో భయాన్ని వ్యక్తం చేసారు. వీన్ స్టీన్ గుడ్డివాడు అయ్యాడు. 20 వేర్వేరు ఔషధాలను సేవిస్తున్న ఆయనను విడుదల చేయకపోతే జైలులో చనిపోతాడని చెప్పడం సంచలనమే అయ్యింది. రకరకాల అనారోగ్యాలతో సతమతమవుతున్న కారణంగా వెంటనే విడుదల కాకపోతే జైలులో చనిపోతానని హార్వే వీన్‌స్టీన్ తరపు న్యాయవాదులు శుక్రవారం విచారణ సందర్భంగా వాదించారు.

నేరంపై అప్పీల్ చేస్తూ వీన్ స్టీన్ బెయిల్ పై విముక్తి పొందాలని లాయర్లు కోరారు. అతను గుడ్డిగా ఉన్నాడని... వీల్ చైర్ కి కట్టేసారని కొరోనరీ ఆర్టరీ వ్యాధితో బాధపడుతున్నాడని.. ప్రోస్టేట్ ఉందని న్యాయవాదులు అంటున్నారు. లాస్ ఏంజిల్స్ విచారణకు సంబంధించిన 2 మిలియన్ల బాండ్.. అదనంగా 5 మిలియన్లను చెల్లించడానికి అతని వద్ద డబ్బు లేదని వారు చెబుతున్నారు.

అయితే ప్రతివాద న్యాయవాది వెర్షన్ వేరొకలా ఉంది. వీన్ స్టీన్ కి ఏమీ కాలేదని .. విడుదలైతే పారిపోవడానికి చూస్తున్నాడని వాదించడం ఆసక్తికరం. వీన్‌స్టీన్ ప్రస్తుతం అత్యాచారం లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ సమయంలో న్యూయార్క్ - ఆల్డెన్ లోని వెండే కరెక్షనల్ ఫెసిలిటీలో 23 సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.