సజ్జనార్ సర్ మళ్లీ రావాల్సిందే: హరీశ్ శంకర్

Mon Sep 13 2021 19:46:10 GMT+0530 (IST)

Harish Shankar says Sajjanar should come for justice

హైదరాబాద్ లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం హత్య ఘటనపై ప్రజలు సెలబ్రిటీలు రాజకీయ నాయకులు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. అయితే దీనిపై డైరెక్టర్ హరీష్ శంకర్ చేసిన ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ గా మారింది.'దిశ' హత్యాచార ఘటనను కొద్దిరోజుల్లోనే క్లోజ్ చేసి తగిన న్యాయం చేసిన డైనమిక్ పోలీస్ ఆఫీసర్ సజ్జనార్ కు ఈ కేసును అప్పగించాలంటూ మంత్రి కేటీఆర్ ను ట్యాగ్ చేసి దర్శకుడు హరీశ్ శంకర్ ట్వీట్ చేశాడు.

ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఈ కేసుపై తక్షణ పరిష్కారం జరగాలంటే 'సజ్జనార్ సార్' కు ఈ కేసును అప్పజెప్పాలని కోరారు. లేకపోతే ఇలాంటి వాటిని చూసి మరింత మంది ప్రేరణ పొందే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విషయంలో మంత్రి కేటీఆర్ ాలోచించాలన్నారు. ఇక ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ట్వీట్ కు స్పందిస్తున్న నెటిజన్లు సజ్జనార్ మాత్రమే న్యాయం చేయగలరంటూ కామెంట్లు చేస్తున్నారు.