Begin typing your search above and press return to search.

#CHIRU 153 అంత ఈజీనా హ‌రీషా!

By:  Tupaki Desk   |   16 Feb 2020 4:30 PM GMT
#CHIRU 153 అంత ఈజీనా హ‌రీషా!
X
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో `గ‌బ్బ‌ర్ సింగ్` డైరెక్ట‌ర్ మూవీ ఊహించ‌ని ట్విస్ట్ అనే చెప్పాలి. డీజే - గ‌ద్ద‌లకొండ గ‌ణేష్ చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద యావ‌రేజ్ అయినా ప‌వ‌న్ అవేవీ ప‌ట్టించుకోకుండా హ‌రీష్ ని న‌మ్మి మ‌రో ఛాన్స్ ఇచ్చాడు. గ‌బ్బ‌ర్ సింగ్ స‌క్సెస్ నేప‌థ్యంలో హ‌రీష్ తో మ‌రో సినిమా చేస్తాన‌ని మాటిచ్చాడు కాబ‌ట్టి ఇప్పుడు నిల‌బెట్టుకుంటున్నాడు. ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో హ‌రీష్ బిజీ. క్రిష్ తో పీ.ఎస్.పీ.కే 27 పూర్త‌వ్వ‌గానే.. హ‌రీష్ శంక‌ర్ తో పీ.ఎస్.పీ.కే28కి కాల్షీట్లు కేటాయించ‌నున్నార‌ట‌.

ఆ క్ర‌మంలోనే హ‌రీష్ స్టేట్ మెంట్లు ఫ్యాన్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. `గబ్బ‌ర్ సింగ్` అభిమానుల అంచ‌నాల‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా ప‌వ‌న్ 28 ఉంటుంద‌ని హ‌రీష్ వేడెక్కించేస్తున్నాడు. ఇదొక్క‌టే కాదు.. ప‌వ‌న్ సినిమా అవ్వ‌గానే.. మెగాస్టార్ చిరంజీవితోను సినిమా చేయ‌డమే ల‌క్ష్యంగా పెట్టుకున్నాడ‌ట‌. చిరుతో నిజ‌మా? అంటే.. అది నిజ‌మేన‌ని హ‌రీష్ క‌న్ఫామ్ చేసేసాడు. పీఎస్ పీకే 28 అనంత‌రం మెగాస్టార్ నే డైరెక్ట్ చేస్తాన‌న‌ని రివీల్ చేసాడు. దీంతో సోష‌ల్ మీడియాలో అది కాస్తా వైర‌ల్ అయ్యింది. మెగాస్టార్ 153వ సినిమా ఛాన్స్ హ‌రీష్ కే అంటూ ప్ర‌చారం మొద‌లైంది. వ‌చ్చే ఏడాది ఈ జోడీ సెట్స్ పైకి వెళ‌తార‌న్న ప్ర‌చారం సాగిపోతోంది.

అయితే హ‌రీష్ కి మెగా ఛాన్స్ నిజ‌మా? చిరు అస‌లే క‌థ‌ల విష‌యంలో రాజీకి రావ‌డం లేదు. కొర‌టాల అంత‌టి వాడే 152వ సినిమా ప్ర‌క‌టించాక‌ ఏళ్ల త‌ర‌బ‌డి ఎదురు చూశారు. 153వ సినిమా అంత సులువుగా హ‌రీష్ కి క‌మిటైపోతారా? అన్న డైలామా అభిమానుల‌కు ఉంది. గ‌తంలో పూరి జ‌గ‌న్నాథ్ విష‌యంలో ఇదే జ‌రిగింది. చిరంజీవికి `ఆటో జానీ` స్క్రిప్ట్ స‌గం వినిపంచి డ్రాప్ అవ్వాల్సొచ్చింది. చిరు మార్పులు కోరినా పూరీని రిజ‌క్ట్ చేశారంటూ ప్ర‌చార‌మ‌వ్వ‌డంతో పూరి హ‌ర్ట‌యిన సంగ‌తి తెలిసిందే. అయినా చిరు రిజెక్ట్ చేసినా క‌సిగా మ‌రో స్క్రిప్టు తెస్తానంటూ పూరి అన్నారు. ఇప్ప‌టికీ అత‌డు చిరు కోసం వెయిటింగ్. ఇప్పుడు హ‌రీష్ కూడా చిరుతో ఫ‌లానా నంబ‌ర్ నాదే అని చెప్పేస్తానంటే కుద‌ర‌దు. మెగా కాంపౌండ్ క‌న్ఫామ్ చేస్తేనే ఖాయ‌మైన‌ట్టు. అంత‌వ‌ర‌కూ ఎదురు చూడాల్సిందే. ఈలోగానే హ‌రీష్ వేరొక‌రితో సినిమా చేసి నిరూపించుకోవాల్సి ఉంటుందన్న ఊహాగానాలు సాగుతున్నాయి.