Begin typing your search above and press return to search.

మ‌ళ్లీ మెగా హీరోతో హ‌రీష్ శంక‌ర్

By:  Tupaki Desk   |   19 Jan 2022 2:31 PM GMT
మ‌ళ్లీ మెగా హీరోతో హ‌రీష్ శంక‌ర్
X
హ‌రీష్ శంక‌ర్‌... ఒక హీరో కున్న మాస్ ప‌ల్స్‌ని సినిమాలో ప్ర‌త్యేకంగా పోట్రేట్ చేయ‌డంలో దిట్ట‌. అందుకు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ తో ఆయ‌న తీసిన `గ‌బ్బ‌ర్ సింగ్ ` బెస్ట్ ఎగ్జాంపుల్ గా నిలిచింది. దాదాపు ఐదేళ్ల విరామం త‌రువాత ఈ మూవీ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని అందించింది. ఓ అభిమాని ప‌వ‌న్ ని ఎలా చూడాల‌నుకుంటారో అదే త‌ర‌హాలో చూపించి శ‌భాష్ అనిపించుకోవ‌డ‌మే కాకుండా ప‌వ‌న్ కెరీర్ లో భారీ వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన చిత్రంగా `గ‌బ్బ‌ర్ సింగ్` ని నిలిపారు హ‌రీష్ శంక‌ర్‌.

దీంతో ఆయ‌న పై మెగా అభిమానుల్లో, మెగా హీరోల్లో ప్ర‌త్యేక అభిమానం ఏర్ప‌డింది. ప‌వ‌న్ త‌రువాత బ‌న్నీతో చేసిన `దువ్వాడ జ‌గ‌న్నాథమ్‌` బ‌న్నీకి హీరోగా తిరుగులేని ఇమేజ్ ని తెచ్చిపెట్టింది. ఈ మూవీ హిందీ డ‌బ్బింగ్ వెర్ష‌న్ నార్త్ లో రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. బ‌న్నీ త‌రువాత మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ తో `గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌`ని రూపొందించారు. వ‌రుణ్ పాత్ర‌ని ప్ర‌త్యేకంగా మ‌లిచిన తీరు అభిమానుల‌ని ఫిదా చేసింది. త‌మిళ హిట్ చిత్రం `జిగ‌ర్తాండ‌` ఆధారంగా ఈ మూవీని తెలుగులో రీమేక్ చేశారు.

వ‌రుణ్ విల‌న్ ని త‌ల‌పించే పాత్ర‌లో న‌టించిన ఆక‌ట్టుకున్న తీరు, అత‌ని మేకోవ‌ర్ ప్ర‌తీ ఒక్క‌రిచేత ఔరా అనిపించింది. తిరిగి హ‌రీష్ శంక‌ర్‌, వ‌రుణ్ తేజ్ మ‌ళ్లీ క‌లిసి ఎప్పుడు ప‌ని చేస్తారా? అని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న వేళ ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ శుభ వార్త వినిపించారు. నేడు హీరో వ‌రుణ్ తేజ్ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా వ‌రుణ్ తేజ్ కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ ఆస‌క్తిక‌రంగా ట్వీట్ చేశారు.

`జిగ‌ర్తాండ‌`లోని బాబీ సింహ పాత్ర‌లో నిన్ను ఊహించుకున్న‌ప్పుడు నాకు తెలియ‌దు... నువ్వు ఆ పాత్ర‌ను ఎంతో క‌ష్ట‌ప‌డి ఆ స్థాయిలో ర‌క్తిక‌ట్టిస్తావ‌ని.. నీకు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెల‌ప‌డం నాకు ఎప్పుడూ ఆనందం క‌లిగిచే విష‌యం. నీతో మ‌రోసారి వ‌ర్క్ చేయ‌డానికి ఎద‌రుచూస్తున్నాను` అని ఆస‌క్తిక‌రంగా ట్వీట్ చేశారు హ‌రీష్ శంక‌ర్‌.

ప్ర‌స్తుతం హ‌రీష్ శంక‌ర్ .. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా `భ‌వ‌దీయుడు భ‌గ‌త్‌సింగ్‌` మూవీ చేస్తున్నారు. ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది. దీని త‌రువాత వ‌రుణ్ తేజ్ తో హ‌రీష్ శంక‌ర్ మ‌ళ్లీ సినిమా చేస్తాడని వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో తానే వ‌రుణ్ తో సినిమా చేయ‌డానికి ఎదురుచూస్తున్నానంటూ హ‌రీష్ శంక‌ర్ ట్వీట్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.