Begin typing your search above and press return to search.

అయ్యో.. హరిహర వీరమల్లు హడావుడి అంతా ఉత్తదేనా?

By:  Tupaki Desk   |   25 Jan 2023 1:00 PM GMT
అయ్యో.. హరిహర వీరమల్లు హడావుడి అంతా ఉత్తదేనా?
X
పవన్‌ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా జనవరి 26వ తేదీ కోసం వెయిట్‌ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న హరి హర వీరమల్లు సినిమా యొక్క టీజర్‌ రిపబ్లిక్‌ డే సందర్భంగా రాబోతుందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా టీజర్ కోసం వెయిట్‌ చేస్తున్నారు.

హరి హర వీరమల్లు టీజర్ అంటూ జరిగిన ప్రచారం నిజం కాదని తెలుస్తోంది. ఇప్పటి వరకు చిత్ర యూనిట్‌ సభ్యులు టీజర్ కు సంబంధించిన చిన్న అప్‌డేట్‌ కూడా ఇవ్వలేదు. దాంతో గత కొన్ని రోజులుగా జరుగుతున్న హడావుడి అంతా ఉత్తదే అని తేలిపోయింది.

సినిమాను ఏప్రిల్‌ నెలలో విడుదల చేసే ఉద్దేశ్యం ఉందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. హరి హర వీరమల్లు సినిమా టీజర్ కోసం వెయిట్‌ చేసిన అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా షూటింగ్ దశలో ఉన్న హరి హర వీరమల్లు సినిమా అప్‌డేట్‌ కోసం అభిమానులు వెయిట్‌ చేస్తూనే ఉన్నారు.

మరో వైపు పవన్‌ కళ్యాణ్‌ వినోదయ్య సిత్తం రీమేక్ షూటింగ్ లో పాల్గొనబోతున్నారు అనే వార్తలు కూడా వస్తున్నాయి. హరి హర వీరమల్లు సినిమా కు చిన్న బ్రేక్ ఇచ్చి రీమేక్ షూటింగ్ కు పవన్ రెడీ అవుతున్నాడని కూడా ప్రచారం జరుగుతోంది. మొత్తానికి పవన్‌ ఫ్యాన్స్ కు ఆయన సినిమా ల విషయంలో గందరగోళం మాత్రం నెలకొంది. అది ఎప్పటికీ క్లియర్ అయ్యేను చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.