Begin typing your search above and press return to search.

హ్యాపీ బ‌ర్త్ డే.. టాలీవుడ్‌ చంద‌మామ

By:  Tupaki Desk   |   19 Jun 2021 10:30 AM GMT
హ్యాపీ బ‌ర్త్ డే.. టాలీవుడ్‌ చంద‌మామ
X
సినిమా ఇండ‌స్ట్రీకి కొంత మంది తుఫానులా ఎంట్రీ ఇస్తారు.. ఆ త‌ర్వాత‌ నీరుగారిపోతారు. మ‌రికొంద‌రు మాత్రం చినుకులా ప్ర‌వేశిస్తారు. ఆ త‌ర్వాత తుఫానులా మారిపోతారు. కెరీర్ చివరి వ‌ర‌కూ అదే జోరు కొనసాగిస్తారు. అలాంటి వారిలో టాలీవుడ్ చందమామ కాజ‌ల్‌ ఒక‌రు. 2007లో 'ల‌క్ష్మీ క‌ల్యాణం' అనే చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ బ్యూటీ.. ఆ త‌ర్వాత 'చంద‌మామ‌' చిత్రంతో ఫస్ట్ సక్సెస్ అందుకుంది.

కానీ.. టాలీవుడ్ అగ్రహీరోయిన్ స్టేటస్ అందుకున్నది మాత్రం 'మగధీర'తోనే. ఆ సినిమాలో కాజ‌ల్ క‌ట్టు, బొట్టు తెలుగు ప్రేక్ష‌కుల‌ను మైమ‌ర‌పింప‌జేసింద‌నే చెప్పాలి. నిజంగానే దేవ్ గ‌ఢ్ యువ‌రాణి అన్న ఫీలింగ్ క‌లిగించింది. ఈ చిత్రం అప్ప‌టి వ‌ర‌కూ ఉన్న రికార్డుల‌ను తిర‌గ‌రాయ‌డంతోపాటు.. కాజ‌ల్ ను ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ గా నిలబెట్టింది. ఈ సినిమా త‌ర్వాత నుంచి కాజ‌ల్ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం రాలేదు.

త్వ‌ర‌లో 15 ఏళ్ల సినీ కెరీర్ పూర్తి చేసుకోబోతోంది కాజ‌ల్‌. ఈ సుదీర్ఘ కెరీర్లో ఎంతో మంది ఈ అమ్మ‌డికి పోటీగా వ‌చ్చారు. కానీ.. అంద‌రినీ హెల్దీ కాంపిటేష‌న్ తోనే ఫేస్ చేస్తూ ముందుకు సాగుతోంది. చంద‌మామ లాంటి అందం.. అంత‌కు మించిన అభిన‌యంతో టాలీవుడ్ లో స్థానం సుస్థిర చేసుకున్న కాజ‌ల్‌.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నో మ‌ర‌పురాని చిత్రాల్లో న‌టించింది. కోట్లాది మంది అభిమానుల‌ను సొంతం చేసుకుంది.

న‌వ‌దీప్ నుంచి మెగాస్టార్ వ‌ర‌కు అంద‌రు స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టించిన ఈ బ్యూటీ.. అంద‌రికీ స‌రిజోడీ అనిపించుకుంది. ద‌శాబ్ద కాలంగా స్టార్ హీరోయిన్ స్టేట‌స్ అనుభ‌విస్తున్న చంద‌మామ‌.. గ‌త అక్టోబ‌ర్ లో వైవాహిక జీవితంలోకి కూడా అడుగు పెట్టింది. బిజినెస్ మెన్ గౌత‌మ్ కిచ్లును పెళ్లి చేసుకొని, కొత్త జీవితం ఆరంభించింది. అయితే.. పెళ్లి త‌ర్వాత కెరీర్ కు పుల్ స్టాప్ పెడుతుందేమోన‌ని భావించిన‌ప్ప‌టికీ.. కెరీర్ కంటిన్యూ చేస్తూ అంద‌రినీ ఆశ్చ‌ర్య‌పురుస్తోంది.

ఈ అమ్మ‌డు అప్ క‌మింగ్ మూవీస్ లో మెగాస్టార్ 'ఆచార్య' రిలీజ్ కు సిద్ధంగా ఉంది. 'ఇండియన్-2 వంటి సినిమాలతోపాటు ప‌లు వెబ్‌సిరీస్ ల‌లోనూ న‌టిస్తోంది. ఇవాళ ఈ బ్యూటీ బ‌ర్త్ డే. పెళ్లి త‌ర్వాత వ‌చ్చిన మొద‌టి పుట్టిన రోజు. ఈ ప్రీషియ‌స్ అకేష‌న్లో టాలీవుడ్ చంద‌మామ హ్యాపీగా ఉండాల‌ని, ఇలాంటి సంతోష‌క‌ర‌మైన పుట్టిన రోజులు మ‌రెన్నో జ‌రుపుకోవాల‌ని ఆశిద్దాం. 'తుపాకీ' తరపున కాజల్ అగర్వాల్ కు హృద‌య‌పూర్వ‌క పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు.