ఫోటో టాక్: హనీవా.. విరహయోగిని వా?

Sun Jul 12 2020 19:00:00 GMT+0530 (IST)

Hansika Shared Her Beautiful Pic In Instagram

సైజ్ జీరో అనేది ఒక ట్రెండ్. బెబో కరీనాకపూర్ ఈ ట్రెండ్ ని పీక్స్ కి తీసుకెళితే ఆ తర్వాత అది ఫాలో చేసేందుకు ఎందరో భామలు ప్రయత్నించి విఫలమయ్యారు. బెబో అంత పర్ఫెక్ట్ ఫిగర్ ని తేవడం ఎవరికీ సాధ్యం కాలేదు. ఇక సైజ్ జీరో లుక్ అనేది శరీరాకృతిని బట్టి కూడా సెట్టవుతుంది.ఇటీవలి కాలంలో పలువురు టాలీవుడ్ నాయికలు సైజ్ జీరో లుక్ కి ప్రయత్నించి దొరికిపోయారు. నయనతార- శ్రీయ సహా నేటితరం నాయికలు ఎందరో జీరో సైజ్ ప్రయత్నించారు. ఇక వీళ్లలో నయన్ కి ఏమంత సెట్ కాలేదు. సింహా సమయంలో సన్నజాజిలా మారిపోవడంతో ఏదో అయ్యిందే అనుకున్నారు.

మొన్నటికి మొన్న జీరో సైజ్ కి మారిపోయిన త్రిష నేచురల్ లుక్ ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. ఆమె ఈమేనా? అంటూ సందేహం వ్యక్తమైంది. అది సరే కానీ.. యాపిల్ బ్యూటీగా పాపులరైన హన్సిక కూడా సైజ్ జీరో ట్రై చేస్తోంది. ఇదిగో లేటెస్టు ఫోటో పరిశీలిస్తే ఆ సంగతి అర్థమవుతోంది.

రామ్ సరసన `కందిరీగ` చిత్రంలో నటించేప్పుడు బొద్దుగా ముద్దుగా యాపిల్ పండునే తలపించిన హన్సిక ఆ తర్వాత కొంతకాలానికి బొద్దుతనం తగ్గించుకునే ప్రయత్నించింది. ప్రస్తుతం ఆ లుక్ చూస్తుంటే చిక్కి శల్యమైపోతోందేమిటి పాపం!! అంటూ పంచ్ లు విసుర్లు ఫ్యాన్స్ నుంచే వినిపిస్తున్నాయి. హనీ ఎందుకింతగా ప్రయోగాలు? మరీ అలా చిక్కిపోతే ఎలా? అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలే సినిమాల్లేక ఖాళీగా ఉన్న హన్సిక కాస్త జిమ్ లో గట్టిగానే శ్రహిస్తున్నట్టుంది. లుక్ అంతగా సెట్టవ్వకపోయినా ఆరోగ్యానికి మంచిదేనేమో! కెరీర్ సంగతి చూస్తే తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్ ఫ్లాపవ్వడంతో తెలుగులో ఆఫర్లేవీ లేవ్. ప్రస్తుతం మహా అనే తమిళ చిత్రంలో నటిస్తోంది. సిగరెట్ పొగ గుప్పు గుప్పున ఊదేస్తున్న యోగినిగా ఈ చిత్రంలో నటించింది. గాల్లో పొగ ఊదే ఫోటోలు ఇప్పటికే అంతర్జాలంలో లీకై వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే.