Begin typing your search above and press return to search.

HIT 2 కలెక్షన్స్.. మొదటిరోజే బీభత్సం!

By:  Tupaki Desk   |   3 Dec 2022 5:58 AM GMT
HIT 2 కలెక్షన్స్.. మొదటిరోజే బీభత్సం!
X
అడవి శేష్ హీరోగా నటించిన హిట్ 2 సినిమాకు విడుదలకు ముందే పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యాయి. శైలేష్ కొలను దర్శకత్వంలో నాని నిర్మించిన ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుంది అని చిత్ర కాన్ఫిడెంట్ గా భారీ స్థాయిలోనే సినిమాను విడుదల చేసింది.

అయితే ఈ సినిమా మొదటి రోజు అనుకున్నట్లుగానే మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఒక విధంగా అడివి శేషు కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాలలో మొదటి స్థానంలో నిలిచిపోవడం విశేషం.

హిట్ 2 సినిమా డిమాండ్ కు తగ్గట్టుగానే మంచి బిజినెస్ చేసింది. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 14.25 కోట్ల రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ అయితే చేసింది. దాదాపు 900 కు పైగా థియేటర్లలో విడుదల చేశారు. ఇక ఏరియాను బట్టి ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ విధంగా షేర్ కలెక్షన్స్ అందుకుంది.

నైజంలో 1.92 కోట్లు, సీడెడ్ లో 38 లక్షలు, ఉత్తరాంధ్రలో 53 లక్షలు, ఈస్ట్ లో 29 లక్షలు, వెస్ట్ 19 లక్షలు, గుంటూరులో 33 లక్షలు, కృష్ణ లో 24 లక్షలు, నెల్లూరులో 15 లక్షలు.. ఇలా మొత్తంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మొదటి రోజు హిట్ 2 సినిమా 4.3 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇక 6.90 కోట్ల గ్రస్స్ వచ్చింది.

కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలిపి 45 లక్షల షేర్ రాగా ఓవర్సీస్ లో 1.95 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్ వచ్చింది. ఇక వరల్డ్ వైడ్ గా మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా 6.43 కోట్ల షేర్ కలెక్షన్స్, 11.75 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఒక విధంగా శేష్ కెరీర్ లోనే ఇది అత్యధిక స్థాయిలో ఓపెనింగ్స్ అందుకున్న నెంబర్ వన్ సినిమాగా నిలిచింది.

ఇక సినిమా బిజినెస్ ను బట్టి బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే 15 కోట్ల షేర్ రావాలి. ఇక మొదటిరోజు వచ్చిన కలెక్షన్స్ తో పోలిస్తే సినిమా ఇంకా బాక్సాఫీస్ వద్ద 8.57 కోట్ల షేర్ కలెక్షన్స్ సాధించాల్సి ఉంది. మొదటి రోజు టాక్ బట్టి ఈ సినిమా రెండవ రోజు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మరింత ఎక్కువ అయ్యాయి. ఆదివారం కూడా కలిసి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇక వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తయ్యే ఛాన్స్ ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.