మహేష్ తర్వాత పవన్ ని లాక్ చేసిన గురూజీ

Mon May 03 2021 13:00:01 GMT+0530 (IST)

Guruji who locked the pawan after Mahesh

సూపర్ స్టార్ మహేష్ తో ప్రస్తుతం త్రివిక్రమ్ లాక్ అయిన సంగతి తెలిసిందే. స్క్రిప్టు పనుల్ని వేగంగా పూర్తి చేసి సెట్స్ కెళ్లేందుకు రెడీ అవుతోంది టీమ్. కోవిడ్ వేవ్ వల్ల కొంతకాలం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇదిలా ఉంటే గురూజీ మరో సినిమాని కూడా లాక్ చేసేశారని టాక్ వినిపిస్తోంది.మహేష్ తర్వాత వెంటనే పవన్ తో మొదలెట్టేస్తారని కూడా గుసగుస వేడెక్కించేస్తోంది. పవన్ ప్రస్తుతం హరిహర వీరమల్లు.. అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ రెండిటితో బిజీ. ఇవి పూర్తవ్వగానే గురూజీ కోసం రెడీ కావాల్సి ఉంటుందట. అయ్యప్పనుమ్ కోషియంకి త్రివిక్రమ్ మాటలు అందించి స్క్రిప్టును కోఆర్డినేట్ చేసిన సంగతి తెలిసిందే.


అయితే పవన్ తో చేసేది కోబలి స్క్రిప్టేనా కాదా అన్నది తేలలేదు. ఇకపోతే ఈ సినిమాని హారిక బ్యానర్ లో తెరకెక్కించే వీలుంటుంది. మహేష్ తో త్రివిక్రమ్ సినిమాని ఇదే బ్యానర్ లో తెరకెక్కిస్తున్నారు.