Begin typing your search above and press return to search.

గుంటూరు కారం షాకిచ్చే బిజినెస్

By:  Tupaki Desk   |   2 Jun 2023 10:00 AM GMT
గుంటూరు కారం షాకిచ్చే బిజినెస్
X
సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీకి గుంటూరు కారం అనే టైటిల్ ని తాజాగా ఫిక్స్ చేశారు. పాన్ ఇండియా లెవల్ లో భారీ బడ్జెట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. గుంటూరు బ్యాక్ డ్రాప్ లో పక్కా మాస్ కమర్షియల్ మూవీగా ఈ సినిమాని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆవిష్కరిస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ స్ట్రైక్ ని కంప్లీట్ మాస్ యాంగిల్ లో ప్రెజెంట్ చేశారు. సూపర్ స్టార్ ఫ్యాన్స్ చాలా రోజుల నుంచి కోరుకుంటున్న పక్కా మాస్ క్యారెక్టర్ లో గుంటూరు కారంలో మహేష్ బాబు కనిపింబోతున్నాడు.

ఇది ఓ విధంగా ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే న్యూస్ అని చెప్పాలి. ఇదిలా ఉంటే సినిమా సినిమాకి మహేష్ బాబు మార్కెట్ వేల్యూ పెరిగిపోతోంది.

ప్రస్తుతం మహేష్ బాబు సక్సెస్ రేట్ బట్టి ఈ మూవీ బిజినెస్ డీల్స్ పై ట్రేడ్ పండితులు ఒక అంచనా వేశారు. కచ్చితంగా సినిమా ఓవర్సీస్ లో 125 కోట్ల వరకు బిజినెస్ చేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఒక ఆంధ్రాలో 60 కోట్ల వరకు బిజినెస్ డీల్ జరిగే ఛాన్స్ ఉందంట. అలాగే నైజాంలో 45 కోట్ల వరకు రైట్స్ అమ్ముడయ్యే అవకాశం ఉందని టాక్.

రెస్ట్ ఆఫ్ ఇండియాలో 30 కోట్ల వరకు జరుగుతుందని భావిస్తున్నారు. ఓవరాల్ గా మూవీపై 150 కోట్ల వరకు బిజినెస్ జరిగే ఛాన్స్ ఉందంట. దీనికంటే ముందుగా షేర్ బిజినెస్ పరంగా అల వైకుంఠపురంలో 150 కోట్ల వరకు చేసింది. ఇప్పుడు గుంటూరు కారం సినిమా కూడా అదే స్థాయిలో బిజినెస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.

ఆర్ఆర్ఆర్, బాహుబలి కాకుండా హైయెస్ట్ బిజినెస్ చేసే మూవీస్ జాబితాలోకి ఇప్పుడు గుంటూరు కారం రాబోతోంది. ఆదిపురుష్ మూవీ తెలుగు డీల్ 170 కోట్లకి జరిగిన అది హిందీ సినిమా క్రింద వస్తోంది. తెలుగులో తెరకెక్కి హ్యూజ్ మార్కెట్ దక్కించుకునే మూవీగా గుంటూరు కారం నిలిచే అవకాశం ఉంటుందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు.