రంగస్థలం మళ్లీ చూసి సమంతాను ఓకే చేశాడట

Sat Apr 01 2023 15:32:25 GMT+0530 (India Standard Time)

Guna Shekar made interesting comments in an interview

సమంత ప్రధాన పాత్రలో నటించిన శాకుంతలం సినిమా మరో రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సినిమా ప్రమోషన్ లో భాగంగా హీరోయిన్ సమంత మరియు దర్శుడు గుణశేఖర్ పలు ఇంటర్వ్యూలతో సందడి చేస్తున్నారు. ఇటీవల దర్శక నిర్మాత గుణశేఖర్ శాకుంతలం సినిమా యొక్క ప్రారంభం గురించి ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.శాకుంతలం సినిమా స్క్రిప్ట్ ను రెడీ చేసుకున్న సమయంలో పలువురు హీరోయిన్స్ ను పరిశీలిస్తున్న సమయంలో మా అమ్మాయి సమంత పేరును సూచించింది. మొదట కాస్త వెనుక ముందు ఆడిన తాను రంగస్థలం సినిమా ను మరోసారి చూసిన తర్వాత శాకుంతలం సినిమాలో సమంత అయితే బాగుంటుందనే నమ్మకానికి వచ్చాను.

రంగస్థలం సినిమాలో సమంత పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనబర్చిన నటన చాలా బాగుంటుంది. కనుక శాకుంతలం సినిమాలో ఆమె పాత్రలో తప్పకుండా బాగుంటుందని అనిపించింది. అందుకే సమంతను మరో ఆలోచన లేకుండా శాకుంతలం సినిమా కు ఎంపిక చేసినట్లు దర్శకుడు గుణశేఖర్ చెప్పుకొచ్చాడు.

దేవ్ మోహన్ హీరోగా నటించిన ఈ సినిమాలో మోహన్ బాబుతో పాటు ఇంకా ఎంతో మంది ప్రముఖ నటీ నటులు ఉన్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ చివరి పది నిమిషాల సన్నివేశాల్లో సందడి చేయబోతుందట. ఆమె పాత్ర ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేస్తుంది అంటూ యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

శాకుంతలం సినిమా ను కేవలం 80 వర్కింగ్ డేస్ లో పూర్తి చేసిన గుణశేఖర్ పోస్ట్ ప్రొడక్షన్ కు ఎక్కువ సమయం కేటాయించినట్లుగా తెలుస్తోంది. అంతే కాకుండా 3డి లో సినిమాను విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో కాస్త ఎక్కువ సమయం గ్రాఫిక్స్ కు కేటాయించినట్లుగా మేకర్స్ పేర్కొన్నారు.

దిల్ రాజు ఈ సినిమాను విడుదల చేయబోతున్న నేపథ్యంలో కాస్త ఎక్కువ థియేటర్లలో శాకుంతలం రిలీజ్ కాబోతుంది. తెలుగు లో మినిమం వసూళ్లు సాధించడం ఖాయ.. అయితే ఇతర భాషల్లో సినిమా పరిస్థితి ఏంటి అనేది చూడాలి.