హాట్ హీరోయిన్ హైట్ ఎంతో గెస్ చేయండి?

Sun Mar 19 2023 15:00:01 GMT+0530 (India Standard Time)

Guess the height of the hot heroine?

అందమైన అమ్మాయిల ఎత్తు-బరువులు అడకూడదంటారు. అలా అడిగితే దిష్టి తగిలేస్తుందని అమ్మాయి లంతో తెగ ఫీలైపోతుంటారు. ముఖ్యంగా బరువు-ఎత్తుల గురించి చర్చకొస్తే! మూతి బిగించే గాళ్స్ ఎంతో మంది. ఈ విషయంలో సెలబ్రిటీ గాళ్స్ తక్కువేం కాదు. పబ్లిక్ గా ఎత్తు-బరువు గురించి అడిగితే అందమైన హీరోయిన్లు కూడా కసుబుస్సు మంటారు. అదే డేటా కోసం వికీపీడియాలోకి వెళ్తే కావాల్సిన సమస్త సమాచారం దొరికేస్తుంది. కాలి బొటన వేలి నుంచి తల రంగు వరకూ పూసగుచ్చినట్లు ఉంటుంది.



డైరెక్ట్ గా అడిగితే చెప్పరు. కానీ వికీలో మాత్రం చెక్ చేసుకుంటే సరి. కానీ నేను అలాంటి హీరోయిన్ ని కాదండోయ్ అంటోంది యూపీ బ్యూటీ సోనాల్ చౌహాన్. అవును ఈ అమ్మడు తాజాగా ఇన్ స్టాలో  ఓ కొత్త ఫోటోని పోస్ట్ చేసింది. స్కర్ట్..స్కిన్ టైట్ దుస్తుల్లో అగ్గిరాజేసే అందాలతో  అదరొగడుతుంది. హైహీల్స్ ధరించి వైడ్ యాంగిల్ లో హైట్ మొత్తం కవర్ అయ్యేలా కెమెరాలకి ఫోజులిచ్చింది. ఆ ఫోటోని ఉద్దేశించి 'గెస్ మై హైట్' అంటూ పోస్ట్ చేసింది.

దీంతో నెటి జనులంతా సోనాల్ హైట్ గురించి రకరకాల నెంబర్లు పోస్ట్ చేస్తున్నారు. కొన్ని సెటైరికల్ కామెంట్లు పడుతున్నాయి. ఇలా హైట్ గురించి తనకు తానుగానే చర్చకు తెర తీసింది. సాధారణంగా ఇలాంటివి  సోషల్ మీడియాలో చాలా రేర్. కానీ సోనాల్ హైట్ సమ్ థింగ్ స్పెషల్ కాబట్టి ఇలాంటి స్ర్టాటజీతో తెలివిగా ప్రచారం పొందుతుంది. ఇంతకీ సోనాల్ హైట్ ఎంతో తెలుసా? 170 సెంటీమిటర్లు.

మరి వికీ సమాచారం ప్రకారం ఎంత వరకూ వాస్తవమో తెలియాలి.  అందులో హెచ్చు తగ్గులు ఏవైనా ఉన్నాయా? అన్నది చూడాలి. మరి ఇలా కరెక్ట్ హైట్ చెప్పిన వారికి సోనాల్ నుంచి ఎలాంటి సర్ ప్రైజ్ వస్తుందో చూడాలి. ఈ  బ్యూటీ సో కెరీర్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. 'లెజెండ్' తో వెలుగులోకి వచ్చిన బ్యూటీ? ఇంకా సక్సెస్ ల కోసం పోరాటం చేస్తూనే ఉంది. బాలయ్య సినిమాలు మినహా మిగతా వి పెద్దగా కలిసి రావడం లేదు.  ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రం  'ఆదిపురుష్' లో నటిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.