ప్రగ్యా జైస్వాల్ పరిచయం అవసరం లేదు. కంచె బ్యూటీగా తెలుగు వారి గుండెల్లో నిలిచి ఉంది. ఇటీవలే అఖండ లాంటి భారీ హిట్ చిత్రంలో నటించింది. అటు బాలీవుడ్ లో సల్మాన్ భాయ్ సరసన అవకాశం అందుకుంది. అయితే కెరీర్ పరంగా ఆశించిన స్థాయి తనకు ఇంకా దక్కలేదు. అయితేనేం ప్రగ్య నిరంతరం సోషల్ మీడియాల్లో తన అభిమానులకు అన్ లిమిటెడ్ ట్రీట్ ని ఇస్తోంది. నిరంతరం ఫోటోషూట్లను షేర్ చేస్తూ ఫాలోవర్స్ గుండెల్లో గుబులు రేపుతూనే ఉంది.
ఇటీవలే ప్రగ్య ఫిన్ లాండ్ వెకేషన్ కి వెళ్లింది. అక్కడి నుంచి వరుసగా ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేసింది. ఇటీవల బిజీ షెడ్యూల్ నుండి కొంత సమయం తీసుకొని ఫిన్లాండ్ కు విహారయాత్రకు వెళ్లానని చెప్పిన ప్రగ్య అక్కడ కొంచెం భయపడ్డానని కూడా తెలిపింది. స్కాండినేవియన్ దేశంలోని అందమైన ప్రకృతి దృశ్యాలను అన్వేషించడమే గాక తన అనుభవాన్ని తన ఫాలోవర్స్ తో షేర్ చేసుకుంది.
ఫిన్ లాండ్ కు వెళ్లడం నాకు లభించిన అత్యంత అద్భుత అనుభవం. మొదట్లో నేను ఇంత చలిగా ఉండే ప్రదేశానికి ఎప్పుడూ వెళ్ళనందున కొంచెం భయపడ్డాను. ఫిన్లాండ్ గురించి చాలా విన్నాను. ఉష్ణోగ్రత -25/-30 డిగ్రీల సెల్సియస్ కు తగ్గుతుందని తెలిసాక కొంచెం భయం కలిగింది. కానీ నేను అక్కడికి వెళ్ళినప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. అక్కడి వాతావరణంతో నిజంగా సుఖంగా ఉన్నామనిపించింది. ప్రారంభం కొన్ని రోజుల తర్వాత నెమ్మదిగా చలిని ఆస్వాధించడం ప్రారంభించాము... అని తెలిపింది.
మంచు ప్రదేశంలో హస్కీ రైడింగ్- స్కీయింగ్ మొదలైన చాలా ఆహ్లాదకరమైన ఆటలను ఆస్వాధించామని తెలిపింది. ఇవన్నీ చాలా సాహసోపేతమైనవి. వీక్షించేందుకు చాలా అద్భుతమైనవి. ఇది నిజంగా శీతాకాలపు అద్భుత ప్రదేశం. మేం గడ్డకట్టిన జలపాతాలను లోయను చూసాం. నిటారుగా ఉన్న ట్రెక్కింగ్ ప్లేస్ కి కూడా వెళ్ళాము. మంచు కురుస్తున్న సమయంలో మంచులోకి నడిచి మళ్లీ పైకి నడవడం సవాల్ లాంటిది. అక్కడ మేం స్నో మొబైల్ లను కూడా నడిపాము. ఇది గొప్ప అనుభూతిని పంచింది'' అని తెలిపారు.
ప్రగ్యా జైస్వాల్ అంతా మంచుతో చేసిన స్నో హోటల్ గురించి వెల్లడించింది. ఒక ఐస్ బార్ .. మంచుతో చేసిన రెస్టారెంట్ కూడా మేం సందర్శించిన చోట ఉంది. అక్కడ మంచుతో చేసిన చర్చి .. ప్రత్యేకమైన వాస్తుశిల్పంతో అనేక బెడ్ రూమ్ లు ఉన్నాయి. నేను ఒక సూపర్ హాట్ ఆవిరి స్నానానికి వెళ్లి గడ్డకట్టిన సరస్సు వద్దకు వచ్చాను. వారు ఘనీభవించిన సరస్సులో ఒక రంధ్రం తవ్వారు. అక్కడ ఐస్ స్విమ్మింగ్ అంటూ మంచు నీటిలో మునగాలని కోరారు. ఇది మీ శరీరాన్ని నయం చేయడానికి నిజంగా సహాయపడే మంచి కార్యకలాపం'' అని ప్రగ్య తెలిపింది.
చివరగా నార్తర్న్ లైట్లను చూసినట్లు ప్రగ్య తెలిపింది. యాత్రలో నాకు ఇష్టమైన భాగం ఉత్తర దీపాలను మేము రెండు రాత్రులు వరుసగా చూశాము. మేము చాలా అదృష్టవంతులం. ఉత్తర దీపాలు పూర్తి రూపంలో కనిపించే సమయంలో మేం వెళ్ళాము. రెండు రాత్రులు మా కోసం చాలా రంగులు నృత్యం చేశాయి. ఇది చాలా అందమైన అనుభవం. నన్ను భావోద్వేగానికి గురిచేసింది. చాలా సంతృప్తినిచ్చిన ప్రయాణం. ఫిన్లాండ్ లో ఇది చాలా అద్భుత సమయం. నేను పునరుజ్జీవనం పొంది తిరిగి వచ్చాను. మేము అన్ని సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొన్నందుకు. సుందరమైన ప్రదేశాల్లోని అద్భుతమైన అనుభవాలు పొందగలిగినందుకు కూడా నేను సంతోషిస్తున్నాను... అని తెలిపింది.
ప్రగ్య ఇటీవల తిరిగి కెరీర్ మ్యాటర్ పై సీరియస్ గా ప్రయత్నాలు ప్రారంభించింది. అలాగే ప్రగ్య ఇటీవల హైదరాబాద్ లో ఓ షాపింగ్ మాల్ లాంచ్ లో ప్రత్యక్షమైంది. ఈ సందర్భంగా ఆకర్షణీయమైన ఆలివ్ గ్రీన్ కలర్ దుస్తులతో పాటు మెడలో డిజైనర్ ఆభరణాలతో అందంగా కనిపించిన ఫోటోలు వైరల్ గా మారాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.