అందమైన ఈ "రెడ్డి హీరోయిన్" ఎవరు... సర్చ్ చేస్తున్న యువత

Mon Feb 06 2023 16:00:01 GMT+0530 (India Standard Time)

Gorgeous Beauty Gouri Priya Reddy In Red Dress

కలర్ ఫొటో సినిమాతో హీరోగా మారిన సుహాస్.. తాజాగా నటించిన చిత్రం రైటర్ పద్మభూషణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆ సినిమాలో కీలక పాత్రలో కనిపించిన గౌరీ ప్రియా రెడ్డి మంచి మార్కులే కొట్టేసింది. తన అందం అభినయంతో అందరినీ మెప్పించిన ఈ ముద్దుగుమ్మ గురించి నెట్టింట తెగ టాక్ నడుస్తోంది. అసలెవరీ అమ్మాయి అంతకు ముందు ఏ సినిమాల్లో కనిపించిందని గూగల్ లో సెర్చ్ చేస్తున్నారు. అయితే మెయిల్ అనే సినిమాతో సినీ రంగంలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ తెలుగు అమ్మాయే కావడం గమనార్హం.గమనార్హం అని ఎందుకు అంటున్నామంటే తెలుగు అమ్మాయి సినీ పరిశ్రమలో రాణించడం అందులోనూ హీరోయిన్ గా నిలవడం చాలా అరుదు కాబట్టి. మెయిల్ సినిమాతో ఎంట్రో ఇచ్చిన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే మంచి మార్కులు దక్కించుకుంది.

కానీ ఆ తర్వాత ఆమె మరెక్కడా కనిపించలేదు. అయితే తాజాగా రైటర్ పద్మభూషణ్ సినిమాలో కనిపించి మాయ చేసేసింది. సినిమా కథ మొత్తాన్ని మార్చి మలిచే పాత్రలో మెరిసింది.  

రైటర్ పద్మభూషణ్ సినిమాలో సుహాస్ టీనా శిల్ప రాజు పాత్రలతో సమానంగా గౌరీ ప్రియ పాత్రకు కూడా మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే గౌరీ ప్రియా రెడ్డి తెలుగు అమ్మాయి కావడంతో ఆమె గురించి తెలుగు వారందరూ తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

అందుకే చిన్నప్పుడే బోల్ బేబీ బోల్ షోలో పాల్గొన్న్ గౌరీ ప్రియా రెడ్డి త్రావత ఒక బ్యూటీ కాంటెస్ట్ లో గెలిచిన తర్వాత నటన మీద ఆసక్తి పెంచుకొని నటన వైపు అడుగులు వేశారు.

ఈ క్రమంలోనే సినిమాల్లో నటించేందుకు.. రకరకాల ప్రయత్నాలు చేసింది. ముందుగా మెయిల్ సినిమాలో ఛాన్స్ దక్కించుకొని కనిపించింది. కేవలం సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఈమె యాక్టివ్ గానే ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ నటి మాత్రమే కాదండోయ్ మంచి సింగర్ కూడా. అలాగే 2018లో మిస్ హైదరాబాద్ కిరీటాన్ని కూడా గెలుచుకుందీ క్యూట్ బ్యూటీ.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.