సింగంతో కలిసి చెడుగుడు ఆడేస్తాడట!

Thu Jun 30 2022 05:00:01 GMT+0530 (IST)

Gopi Chandh Update on his Next Movie

మ్యాచో మ్యాన్.. హీరో గోపీచంద్ గత కొంత కాలంగా కెరీర్ పరంగా స్ట్రగుల్ అవుతున్నారు. 'జిల్' మూవీ నుంచి బి. గోపాల్ డైరెక్షన్ లో చేసిన 'ఆరడుగుల బుల్లెట్' వరకు గోపీచంద్ నటించిన ఏ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది. 'జిల్' నుంచి ఇప్పటి వరకు ఎనిమిది చిత్రాల్లో నటిస్తే అందులో సంపత్ నంది రూపొందించిన 'సీటీమార్' మాత్రమే యావరేట్ హిట్ గా నిలిచి గోపీచంద్ కు ఊరటనిచ్చింది. గత ఏడేళ్లుగా కెరీర్ పరంగా తీవ్ర ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు.ప్రస్తుతం మారుతి డైరెక్షన్‌లో గోపీచంద్ నటించిన 'పక్కా కమర్షియల్' ఆయనని హిట్ ట్రాక్ ఎక్కించేలా కనిపిస్తోంది. జీఏ2 పిక్చర్స్ యువీ క్రియేషన్స్ లపై స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో యంగ్ అండ్ టాలెంటెడ్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు ఈ మూవీని నిర్మించారు.

ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి ట్రైలర్ వరకు ఈ మూవీపై మంచి బజ్ క్రియేట్ అయింది. పక్కా కమర్షియల్ లాయర్ పాత్రలో హీరో గోపీచంద్ పాత్రని దర్శకుడు మారుతి మలిచిన తీరు సినిమాకు పాజిటివ్ వైబ్స్ ని క్రియేట్ చేస్తూ వస్తోంది.

ఇటీవలే సెన్సార్ ఫార్మాలిటీస్ ని పూర్తి చేసుకున్న ఈ మూవీ జూలై 1న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గోపీచంద్ మార్కు యాక్షన్ మారుతి మార్కు ఎంటర్ టైన్ మెంట్ ని మిలితం చేసి ఓ చక్కని యాక్షన్ ఫ్యామిలీ డ్రామాగా ఈ మూవీని రూపొందించారు. పాజిటీవ్ వైబ్స్ మొదలైన ఈ మూవీతో హీరో గోపీచంద్ మళ్లీ ట్రాక్ లోకి రావాలనే ప్రయత్నాల్లో వున్నారు. ఈ ప్రాజెక్ట్ పై గట్టి నమ్మకంతో వున్న హీరో గోపీచంద్ ఈ మూవీ తరువాత పక్కా మాస్ మసాలా హైవోల్టేజ్ డ్రామాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టుగా తెలిసింది.

'పక్కా కమర్షియల్' తరువాత ఇంత వరకు తన తదుపరి చిత్రాన్ని ప్రకటించని హీరో గోపీచంద్ మాస్ యాక్షన్ చిత్రాల దర్శకుడు హరి దర్శకత్వంలో కొత్త సినిమాకు శ్రీకారం చుట్టబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. భారీ స్థాయిలో సెట్స్ పైకి రానున్న ఈ మూవీని తెలుగు తమిళ భాషల్లో ఏక కాలంలో బై లింగ్వల్ మూవీగా తెరపైకి తీసుకురానున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ మూవీ వుంటుందని ఇందులో గోపీచంద్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారని తెలిసింది.

హీరో సూర్యతో  దర్శకుడు హరి తెరకెక్కించిన సింగం సిరీస్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాల్ని సాధించి హీరో సూర్యకు మంచి పేరుతో పాటు హీరోగా ఆయనకు స్టార్ డమ్ ని అందించిన విషయం తెలిసిందే. విక్రమ్ తో చేసిన 'స్వామి స్వేర్' తరువాత హరి మరో సినిమా ప్రకటించలేదు. దాదాపు నాలుగేళ్ల విరామం తరువాత ఆయన మళ్లీ తనదైన మార్కు హైవోల్టేజ్ యాక్షన్ మూవీతో గోపీచంద్ తో కలిసి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని తెలిసింది.