ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆ సమస్య తీరిపోయినట్లే!

Thu Jan 26 2023 15:00:01 GMT+0530 (India Standard Time)

Good news for Prabhas fans.. that problem seems to be solved!

ఈశ్వర్ సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన ప్రభాస్ మొదటి సినిమాతో తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఆ తర్వాత తీసిన వర్షం ఛత్రపతి బిల్లా డార్లింగ్ మిస్టర్ పర్ ఫెక్ట్ మిర్చి బాహుబలి వంటి చిత్రాల్లో నటించి తెలుగు సినిమా రేంజ్ ను కూడా పెంచేశాడు. ముఖ్యంగా బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్.. ఆ సినిమాల తర్వాత నుంచి ఎక్కువ సినిమాల్లో కనిపించడం లేదు. బాహుబలి సాహో రాధే శ్యామ్ కోసం ఏళ్లకు ఎళ్లు ఖర్చు పెట్టిన ప్రభాస్.. మళ్లీ ఫుల్లు బిజీగా మారబోతున్నాడు.



ఒకేసారి నాలుగైదు సినిమాలకు ఓకే చెప్పిన డార్లింగ్.. వరుస షూటింగ్ లతో తెగ బిజీగా మారిపోయాడు. బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తో ఎప్పటి నుంచో ఓ ప్రాజెక్టు ప్లానింగ్ లో ఉండగా... మైత్రీ మూవీ మేకర్స్ దీని కోసం ప్రణాళికల్లో ఉంది. ఒకవేళ మిస్ అయితే యష్ రాజ్ బ్యానర్ కు వెళ్లే అవకాశం ఉంది. అయితే కేవలం ఓవర్ ది టాప్ యాక్షన్ ఎపిసోడ్స్ తప్ప కథా కథనాల మీద అంత దృష్టి పెట్టడమే కంప్లయింట్ సిద్ధార్థ్ ఆనంద్ మీద ఉంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ అంతా వీరిద్దరి కాంబోలో వచ్చే సినిమాపై కాస్త టెన్షన్ పడుతున్నారు.

ప్రభాస్ నటించిన సాహో తాలుకా అనుభవాలను అభిమానులు ఎవరూ మర్చిపోలేదు. దీని వల్లే వీరిద్దిరి కాంబోలో యాక్షన్ మూవీ అంటే అందరూ టెన్షన్ పడుతున్నారు. కానీ తాజాగా వచ్చిన పఠాన్ సినిమాతో ఈ టెన్షన్ కాస్త తీరబోతోంది. ఎలాగంటారా.. స్టార్ పవర్ ను వాడుకొని ఎలివేషన్లను పండించడంలో సిద్ధార్థ్ ఆనంద్ మేటి. ఇలా చేసే అతడు మూడు హిట్లను కొట్టాడు. అయితే తాజాగా ఆయన హృతిక్ రోషన్ తో ఫైటర్ అనే సినిమాను చేయబోతున్నాడు. ఇది పూర్తి కాగానే ప్రభాస్ తో తన నెక్స్ట్ మూవీ పట్టాలెక్కనుంది..

అయితే ఈ సినిమాకు ముందే హృతిక్ ప్రభాస్ కాంబోలో వార్ 2 తీయాలనుకున్నప్పటికీ సాధ్య పడలేదు. దీంతో ముందు ఫైటర్ తీయబోతున్నాడు. వచ్చే ఏడాదిలోగా ఈ సినిమాను పూర్తి చేసుకొని ప్రభాస్ సినిమాను పట్టాలెక్కించబోతున్నారు. అలాగే ఆది పురుష్ సలార్ మారుతి సినిమా ప్రాజెక్ట్ కే స్పిరిట్... ఇవన్నీ పూర్తయ్యాకే సిద్దార్థ్ ఆనంద్ ప్రభాస్ ల కాంబోలో రాబోతున్న పాన్ ఇండియా మూవీ పట్టాలెక్కే అవకాశం ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.