Begin typing your search above and press return to search.

గుడ్ లక్‌ కీర్తి.. బ్యాడ్ సెంటిమెంట్ బ్రేక్‌ చేయాలి

By:  Tupaki Desk   |   25 Jan 2022 4:54 AM GMT
గుడ్ లక్‌ కీర్తి.. బ్యాడ్ సెంటిమెంట్ బ్రేక్‌ చేయాలి
X
తమిళ సినిమాలతో హీరోయిన్ గా పరిచయం అయిన కీర్తి సురేష్‌ తెలుగు లో మహానటి తో స్టార్‌ హీరోయిన్‌ గా గుర్తింపు దక్కించుకుంది. మహానటి లేడీ ఓరియంటెడ్‌ చిత్రం అయినా కూడా కీర్తి సురేష్‌ కు మంచి కమర్షియల్‌ హీరోయిన్ గా పేరు వచ్చింది.

స్టార్‌ హీరోలు పలువురు ఈమె తో కలిసి నటించేందుకు ఆసక్తి చూపించారు.. ఇంకా చూపిస్తూనే ఉన్నారు. అయితే ఇదే సమయంలో కీర్తి సురేష్ మరిన్ని లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలను చేసేందుకు ముందుకు వచ్చింది. ఆమె నటించిన పెంగ్విన్‌ మొదలుకుని పలు లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలు నిరాశ పర్చాయి. మహానటి తర్వాత ఆమె లేడీ ఓరియంటెడ్‌ చిత్రం ఏది కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ ను దక్కించుకోలేదు. దాంతో కీర్తి సురేష్ కు లేడీ ఓరియంటెడ్‌ మూవీ కలిసి రాదు అనే బ్యాడ్‌ సెంటిమెంట్‌ ఒకటి ప్రచారం మొదలు అయ్యింది.

కీర్తి సురేష్‌ బ్యాడ్‌ సెంటిమెంట్‌ విషయంలో ప్రస్తుతం అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ వారంలో ఆమె నటించిన గుడ్ లక్‌ సఖి సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఒక గిరిజన యువతి అయిన అమ్మాయి ఆర్చరీలో ఎలా అంతర్జాతీయ స్థాయి ఛాంపియన్ అయ్యింది అనేది ఆ సినిమాలో చూపించబోతున్నారు.

సినిమా లో ఆమె ఎప్పుడు కూడా బ్యాడ్‌ లక్ తో బాధపడే అమ్మాయి. బ్యాడ్‌ లక్‌ అంటూ అందరి విమర్శలు ఎదుర్కొన ఆ అమ్మాయి ఎలా తన బ్యాడ్‌ లక్‌ ను గుడ్‌ లక్ గా మార్చుకున్నది అనేది సినిమా కథ. జగపతిబాబు మరియు ఆది పినిశెట్టి కీలక పాత్రలో కనిపించబోతున్న ఈ సినిమాకు నగేష్ కుకునూర్ దర్శకత్వం వహించాడు. సినిమా విడుదల చాలా కాలంగా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు విడుదలకు సిద్దం అయ్యింది.

ఈ వారంలో విడుదల కాబోతున్న ఈ సినిమా కీర్తి సురేష్ ను పట్టి పీడిస్తున్న బ్యాడ్‌ సెంటిమెంట్‌ ను బ్రేక్‌ చేస్తుందేమో చూడాలి. ఈ సినిమా తో లేడీ ఓరియంటెడ్ చిత్రాల విషయంలో బ్యాడ్‌ లక్ కీర్తి కాస్త గుడ్‌ లక్‌ కీర్తి గా మారుతుందా అనేది చూడాలి.

ఈ సినిమా మాత్రమే కాకుండా కీర్తి సురేష్ సూపర్‌ స్టార్‌ మహేష్ బాబుకు జోడీగా సర్కారు వారి పాట సినిమా లో నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ముగింపు దశకు వచ్చింది. ఇక చిరంజీవి తో కలిసి భోళా శంకర్ లో నటిస్తోంది. చిరంజీవికి సోదరి పాత్రలో కీర్తి సురేష్ కనిపించబోతుంది. ఇక గుడ్ లక్‌ సఖి సినిమా లో కీర్తీ సురేష్ లుక్ కు మరియు నటనకు మంచి మార్కులు పడుతాయని ట్రైలర్‌ చూస్తుంటేనే అర్థం అవుతుంది. మరి ఆమెకు ఈ సినిమా లక్‌ మార్చేస్తుందా అనేది చూడాలి.