Begin typing your search above and press return to search.

సలార్.. ఓ గుడ్ న్యూస్!

By:  Tupaki Desk   |   28 May 2023 4:02 PM GMT
సలార్.. ఓ గుడ్ న్యూస్!
X
పాన్ ఇండియా స్టార్‌గా మారిన తర్వాత మరింత ఉత్సాహంగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఇలా ఇప్పుడు వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తోన్నాడు. అందులో 'కేజీఎఫ్' సిరీస్‌తో ప్రపంచం మొత్తం తన వైపు తిరిగి చూసేలా చేసిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ 'సలార్' అనే యాక్షన్ మూవీని కూడా చేస్తోన్నాడు.

'సలార్' మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. కానీ, ప్రభాస్ వేరే సినిమాల కమిట్‌మెంట్స్‌తో పాటు కొన్ని అనివార్య కారణాల వల్ల చిత్రీకరణ సజావుగా సాగడం లేదు. అయినప్పటికీ వీలు చిక్కినప్పుడల్లా కొన్ని కీలకమైన షెడ్యూళ్లను పూర్తి చేసుకుంటూ వచ్చారు. ఇలా ఇప్పటికే 90 శాతానికి పైగా షూటింగ్‌ను కంప్లీట్ చేసుకున్నారు.

ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న 'సలార్' మూవీకి సంబంధించి తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు హైదరాబాద్ నగరంలోని ఓ ప్రముఖ స్టూడియోలో జరుగుతుందట. ఇందులో ఈరోజు నుంచి ప్రభాస్ పాల్గొంటున్నాడని తెలిసింది. ఇది రేపు (మే 29) కూడా కొనసాగుతుందని ఫిలిం నగర్ వర్గాల టాక్.

ప్రస్తుతం 'ఆదిపురుష్' మూవీ ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీగా గడుపుతోన్న ప్రభాస్.. 'సలార్' కోసం ఈ రెండు రోజులు కేటాయించాడని తెలిసింది. ఇందులో అతడిపై కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలిసింది. ఇందులో ప్రభాస్‌తో పాటు కొందరు ఫేమస్ ఆర్టిస్టులు కూడా పాల్గొన్నారని అంటున్నారు. ఇదే ఈ సినిమాకు లాస్ట్ షెడ్యూల్ అయ్యే ఛాన్స్ ఉందనే టాక్ కూడా వినిపిస్తోంది.

ఇదిలా ఉండగా.. 'సలార్' మూవీలో ప్రభాస్ డుయల్ రోల్ చేస్తున్నాడు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని హొంబళే ఫిల్స్ సంస్థ నిర్మిస్తోంది.

ఈ చిత్రంలో జగపతి బాబు, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. దీన్ని 2023 సెప్టెబర్ 28న విడుదల చేయబోతున్నాట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.