Begin typing your search above and press return to search.
దసరా ధమాకా.. గుడ్ సినిమా గ్రూప్ నాలుగు సినిమాలు
By: Tupaki Desk | 25 Oct 2020 10:50 AMటాలీవుడ్ లో గుడ్ సినిమా గ్రూప్ సైలెంటుగా మీడియం రేంజ్ సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. మారుతి దర్శకత్వంలోని ఈరోజుల్లో మొదలు వరుసగా సినిమాలు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ బ్యానర్ వరుసగా ఒకదాని వెంట ఒకటిగా నాలుగు సినిమాలు నిర్మిస్తోంది.
విజయదశమి కానుకగా వీటికి సంబంధించిన ప్రమోషన్ స్టార్టయ్యింది. తాజాగా నాలుగు విభిన్న టైటిల్స్ తో దసరా శుభాకాంక్షలతో పోస్టర్లను రిలీజ్ చేశారు. సంపూర్ణేష్ హీరోగా`గోల్డ్ మ్యాన్`.. కుమారి 21 ఎఫ్ హెబ్బా పటేల్ తో `క్రేజీ అంకుల్స్ `.. నవతరం ట్యాలెంటుతో గోదారి కథలు .... నలుగురితో నారాయణ చిత్రాల్ని గుడ్ సినిమా గ్రూప్ నిర్మిస్తోంది.
ఇవన్నీ వేటికవే ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. ఇక టైటిల్ సెలక్షన్ పరంగానే సక్సెస్ కనిపిస్తోంది. వీటిలో క్రేజీ అంకుల్స్ చిత్రం క్రిస్మస్ కానుకగా ఈ డిసెంబర్ లో రిలీజ్ కి రెడీ అవుతుండగా మిగతా మూడు చిత్రాలు 2021 సంక్రాంతికి రిలీజ్ కానున్నాయి. వీటికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.