అయ్యయ్యో గోల్డ్ నకిలీ గోల్డ్ అయ్యిందే..!

Fri Dec 02 2022 21:00:01 GMT+0530 (India Standard Time)

Gold movie news

ప్రేమం లాంటి సినిమా తీసిన మళయాళ దర్శకుడు ఆల్ఫోన్స్ పుత్రెన్ దాదాపు ఏడేళ్ల తర్వాత తీసిన సినిమా గోల్డ్. మళయాళ స్టార్ పృథ్వీరాజ్ హీరోగా కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన ఈ గోల్డ్ మూవీ గురువారం రిలీజైంది. సినిమా టీజర్ ట్రైలర్ సాంగ్స్ లాంటి ప్రచార చిత్రాలు లేకుండా రిలీజైన ఈ మూవీ ఆశించిన స్థాయిలో లేదు. ప్రేమం మూవీ తీసిన డైరెక్టర్ ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత తీసిన ఈ గోల్డ్ షార్ట్ ఫిల్మ్ కి ఎక్కువ సినిమాకు తక్కువ అనేలా ఉందని అంటున్నారు.  ఈమధ్య వరుస క్రేజీ సినిమాలతో సత్తా చాటుతున్న పృధ్వి రాజ్ ఆల్ఫోన్స్ డైరక్షన్ లో సినిమా అంటే సినిమా ని ఒక రేంజ్ లో ఊహించుకున్నారు కానీ సినిమా మాత్రం ఆడియన్స్ కి షాక్ ఇచ్చింది. సినిమా చూసిన ఆడియన్స్ అంతా కూడా బాబోయ్ ఇది గోల్డ్ కాదు నకిలీ గోల్డ్ అంటున్నారు. 3 గంటల ఇన్ స్టాగ్రాం రీల్ లా మూవీ ఉందని.. సినిమా ఎక్కడ ఆసక్తికరంగా అనిపించలేదని కామెంట్స్ చేస్తున్నారు.

ప్రేమం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాక ఆ డైరక్టర్ నుంచి వస్తున్న సినిమాగా గోల్డ్ ఎన్నో అంచనాలతో రాగా సినిమా చూసిన ఆడియన్స్ కి బిగ్ షాక్ తగిలింది. ఇంతమంచి స్టార్ కాస్ట్ ఉంచుకుని కూడా ఆల్ఫోన్స్ మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాడని అంటున్నారు. అంతేకాదు 30 నిమిషాలు తీయాల్సిన సినిమాను 165 నిమిషాల పాటు సాగదీశారని.. సినిమా ఒక షార్ట్ ఫిల్మ్ కన్నా ఘోరంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.

ఒక సినిమాకు టీజర్ ట్రైలర్స్ చాలా ముఖ్యం.. కానీ అలాంటివి ఏవి రిలీజ్ చేయకుండా ఈ మూవీ రిలీజ్ చేశారు. అఫ్కోర్స్ ఇదొక ప్రయోగమే అనుకున్నా అది కాస్త బిగ్ షాక్ ఇచ్చింది. పృధ్వి రాజ్ చేసిన ఈమధ్య సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతుంటే గోల్డ్ మాత్రం చేతులెత్తేసింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.