ప్రముఖ సింగర్ ఇంట్లో నగల చోరీ..!

Sat Apr 01 2023 15:09:59 GMT+0530 (India Standard Time)

Gold Jewelery Stolen From Singer Vijay Yesudas House

రీసెంట్ గానే సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్య ఇంట్లో బంగారం దొంగతనం కేసు బయట పడగా ఆ కేసు సాల్వ్ అయ్యింది అనుకునేలోగా మరో సెలబ్రిటీ ఇంట్లో బంగారు నగల చోరీ కేసు హాట్ టాపిక్ అయ్యింది. ఐశ్వర్య ఇంట్లో పని మనిషి ఈశ్వరి చేతివాటం వల్లే నగల చోరీ జరిగిందని పోలీసులు కనిపెట్టారు.



ఇక లేటెస్ట్ గా సింగర్ విజయ్ ఏసుదాస్ ఇంట్లో నగలు మిస్ అయినట్టు తెలుస్తుంది. లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో లాకర్ లో 60 సవర్ల నగలు ఉన్నాయని. వాటిని మళ్లీ గత నెల 18న కూడా కనబడ్డాయని ఆ తర్వాత చూస్తే మాయమయ్యాయని అంటున్నారు.  

ఈమధ్యనే ఆ లాకర్ చూస్తే నగలు మిస్ అయినట్టు గుర్తించారట. ఈ మేరకు సింగర్ విజయ్ ఏసుదాస్ భార్య దర్శన చెన్నై లోని అభిరామపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇంట్లో పనిచేస్తున్న మేనక సయ్యద్ పెరుమాళ్ పై అనుమానం ఉందని ఆమె ఫిర్యాదులో రాసుకొచ్చారు. కేసు విచారిస్తున్న అభిరామపురం పోలీసులు విజయ్ ఏసుదాస్ ఇంట్లో పనిచేస్తున్న వారిని విచారిస్తున్నట్టు తెలుస్తుంది.    

ఈమధ్య సెలబ్రిటీస్ ఇంట్లో దొంగతనాలు చాలా ఎక్కువ అయ్యాయి. తమ దగ్గర పనిచేస్తున్న వారిని అతిగా నమ్మడం వల్ల ఈ నష్టాలు జరుగుతున్నాయని చెప్పొచ్చు. సెలబ్రిటీస్ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటుంటారు. అక్కడ పనిచేసే వారికి ఇంట్లో ఏవి ఎక్కడ ఉంటాయన్నది బాగా తెలుసు. అందుకే వారి లేని టైం లో ఇలా చేతివాటం చూపిస్తుంటారు.  

పనుల హడావిడిలో లాకర్లకు సరిగా తాళాలు వేశామా లేదా అన్నది కూడా చూసుకోకుండా సెలబ్రిటీస్ హడావిడిగా బయటకు వెళ్తుంటారు. అదే అదునుగా అక్కడ పనిచేస్తున్న వారు ఇలాంటి చోరీలకు పాల్పడుతున్నారు. సెలబ్రిటీస్ కూడా కొద్ది మొత్తం మిస్ అయితే పెద్దగా పట్టించుకోరు కానీ భారీగా దొంగతనం జరిగితే మాత్రం పోలీసులను ఆశ్రయిస్తున్నారు.