Begin typing your search above and press return to search.

ట్రైలర్‌ః గాడ్జిల్లా vs కాంగ్‌ విజువల్ వండర్‌

By:  Tupaki Desk   |   25 Jan 2021 3:35 AM GMT
ట్రైలర్‌ః గాడ్జిల్లా vs కాంగ్‌ విజువల్ వండర్‌
X
కరోనా కారణంగా దాదాపుగా ఏడాది కాలంగా పెద్ద సినిమాలు లేవు. హాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు అన్ని భాషల సినిమాలకు బ్రేక్ వేసింది కరోనా. ఎట్టకేలకు మళ్లీ జనాలు థియేటర్ల వైపుకు అడుగులు వేస్తున్నారు. మూత పడ్డ థియేటర్లు అన్ని చోట్ల తెరుచుకున్నాయి. దాంతో సినిమాలను విడుదల చేసేందుకు సిద్దం అవుతున్నారు. వందల కోట్లతో రూపొందే హాలీవుడ్ సినిమాలను కూడా విడుదలకు సిద్దం చేస్తున్నారు. హాలీవుడ్‌ మూవీ గాడ్జిల్లా vs కాంగ్‌ విడుదలకు సిద్దం అయ్యింది. మార్చి 26న థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ సినిమా మొదటి ట్రైలర్‌ ను విడుదల చేశారు. అంతా ఊహించినట్లుగానే అద్బుతమైన విజువల్‌ వండర్‌గ ఆ ఈ సినిమా ఉండబోతుందని ట్రైలర్‌ చూస్తుంటేనే అర్థం అవుతుంది.

కింగ్ కాంగ్‌ సినిమా లోని కాంగ్ క్యారెక్టర్‌ ను కొనసాగిస్తున్నారు. బంధిగా చిక్కిన కాంగ్ ను ఉపయోగించుకుని వినాశనం సృష్టిస్తున్న గాడ్జిల్లాలను ఎలా అంతం చేశారు అనేది కథగా ట్రైలర్‌ ను బట్టి తెలిసి పోతుంది. సినిమాలో గాడ్జిల్లా మరియు కాంగ్ ల ఫైట్ సీన్స్ విజువల్ వండర్‌ అన్నట్లుగా ఉండబోతున్నాయి. ఇక కాంగ్ ఒక చిన్న పాపతో కనెక్ట్‌ అవ్వడం సెంటిమెంట్ గా కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉంది. హాలీవుడ్‌ యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారికి ఇదో విజువల్ ట్రీట్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు.