గాడ్ ఫాదర్ మరో మెగా ఈవెంట్ కి సన్నాహాలు

Fri Sep 30 2022 13:37:33 GMT+0530 (India Standard Time)

Godfather is preparing for another mega event

మెగాస్టార్ గాడ్ ఫాదర్ సినిమా అక్టోబర్ 5న విడుదల కాబోతుంది. ఇటీవలే అనంతపురం లో భారీ ఎత్తున ఈ సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. వర్షం పడినా కూడా వేడుక మాత్రం ఆగకుండా వైభవంగా సాగింది. గాడ్ ఫాదర్ సినిమా అనంతపురం ప్రీ రిలీజ్ ఈవెంట్ సక్సెస్ అవ్వడంతో మరో మెగా ఈవెంట్ కి సన్నాహాలు జరుగుతున్నాయి.మొదట్లోనే అనంతపురం మరియు ముంబయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ లను నిర్వహించాలని భావించారు. అనంతపురం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్.. ముంబయి ఈవెంట్ కి సల్మాన్ ఖాన్ ముఖ్య అతిథులుగా హాజరు అవ్వబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. పవన్ కళ్యాణ్ అనంతపురం యొక్క ఈవెంట్ లో కనిపించలేదు.

ముంబయి లో ఈవెంట్ కు సల్మాన్ ఖాన్ భద్రత నేపథ్యంలో సాధ్యం కాలేదు. అందుకే ముంబయి వేడుక క్యాన్సిల్ అయ్యింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం దుబాయ్ లో భారీ ఎత్తున మెగా ఈవెంట్ ను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అతి త్వరలోనే ఈ వేడుక యొక్క అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ సమాచారం అందుతోంది.

ఇక గాడ్ ఫాదర్ చిత్ర దర్శకుడు తన యొక్క గాడ్ ఫాదర్ సినిమాపై చాలా ఎగ్జైట్ గా ఉన్నట్లుగా పేర్కొంటూ ట్వీట్ చేశాడు. అంతే కాకుండా తన సోదరుడు జయం రవి నటించిన పొన్నియన్ సెల్వన్ విడుదల నేపథ్యంలో చాలా సంతోషంగా ఉందంటూ చిరంజీవి.. సల్మాన్ తో ఉన్న ఫోటోలను తన తండ్రి ఫోటోలను మోషన్ రాజా షేర్ చేశాడు.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.