ఆ జాబితాలో టాలీవుడ్ నుండి ఒకే ఒక్కడు దర్శకధీరుడు

Fri Mar 31 2023 17:01:42 GMT+0530 (India Standard Time)

Global Fame Helps Rajamouli Enter Powerful Indians List

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రంతో మరోసారి దేశ వ్యాప్తంగా వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. గత ఏడాది నుండి మొన్న నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు దక్కినంత వరకు రాజమౌళి వార్తల్లో ఉంటూనే వచ్చారు. అందుకే ఇండియన్ ఎక్స్ ప్రెస్ విడుదల చేసిన 2023 మోస్ట్ పవర్ఫుల్ ఇండియన్స్ జాబితాలో రాజమౌళి చోటు దక్కించుకున్నారు.తెలుగు సినిమా పరిశ్రమ నుంచి ఆ జాబితాలో చోటు దక్కించుకున్న ఒకే ఒక్కరు రాజమౌళి. ఆ జాబితాలో రాజమౌళి కి 95 వ స్థానం దక్కింది. రాజమౌళి ఎంత పవర్ఫుల్ లో ఈసారి ఇండియన్ ఎక్స్ ప్రెస్ టాప్ 100 జాబితాలో వెళ్లడి అయింది. ఈ జాబితాలో నెంబర్ వన్ స్థానాన్ని ప్రధాని నరేంద్ర మోడీ దక్కించుకున్నారు. తర్వాత స్థానంలో అమిత్ షా ఉన్నారు.

ఎస్ జయశంకర్.. డివై చంద్ర చూడ్.. యోగి ఆదిత్యనాథ్.. మోహన్ భగవత్.. జేపీ నడ్డా.. నిర్మల సీతారామన్.. ముకేశ్ అంబానీ.. అజిత్ దోవల్ టాప్ టెన్ లో చోటు దక్కించుకున్నారు. గత ఏడాది 51 వ స్థానంలో ఉన్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రభావమో ఏమో కానీ ఈసారి 15వ ర్యాంకులో నిలిచారు.

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ జాబితాలో 58వ ర్యాంకు దక్కించుకున్నారు. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ 53వ ర్యాంక్... రోహిత్ శర్మ 83వ ర్యాంకులు దక్కించుకున్నారు.

ఇక బాలీవుడ్ స్టార్స్ షారుఖ్ ఖాన్ 50వ స్థానంలో.. అమితాబచ్చన్ 87 వ స్థానంలో.. దీపికా పదుకొనే 97వ స్థానంలో ఆలియా భట్ 99 వ స్థానంలో బాలీవుడ్ యంగ్ హీరో రణవీర్ సింగ్ 100వ స్థానంలో ఉన్నారు.        


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.