Begin typing your search above and press return to search.

'ఫ్యాన్ కామెంట్'కు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన గ్లామరస్ యాంకరమ్మ..!

By:  Tupaki Desk   |   12 May 2021 3:30 AM GMT
ఫ్యాన్ కామెంట్కు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన గ్లామరస్ యాంకరమ్మ..!
X
తెలుగు అందమైన టీవీ యాంకర్స్ లో విష్ణుప్రియ ఒకరు. ఈ యాంకరమ్మకు యువతలో మంచి క్రేజ్ ఉంది. 'పోవే పోరా' టీవీ షోతో పాపులారిటీ దక్కించుకున్న విష్ణుప్రియ.. మోడలింగ్ నుండి బుల్లితెర పై ప్రవేశించింది. అటు టీవీ ప్రోగ్రాంలతో పాటు విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో కూడా తెగయాక్టీవ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు గ్లామరస్ ఫోటోషూట్స్ చేస్తూ అమాంతం ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ప్రస్తుతం కరోనా కారణంగా టీవీ కార్యక్రమాలకు బ్రేక్ పడటంతో ఇంటికే పరిమితమైంది విష్ణు. ఇంట్లో ఖాళీగా ఉండకుండా తనలోని టాలెంట్స్ అన్నీ బయట పెడుతోంది. ఇటీవలే విష్ణుప్రియకు సంబంధించిన డాన్స్ వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగహల్చల్ చేసింది.

ఆ వీడియోలో విష్ణుప్రియ తన నడుమును సాంగ్ బీట్‌కు తగ్గట్లు ఊపుతూ వయ్యారంగా అదరగొట్టింది. తాజాగా ఈ యాంకర్ లేటెస్ట్ ఫోటోషూట్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలలో విష్ణుప్రియ సారీ కట్టుకొని కుర్రకారు మతులు పోగొట్టిందని చెప్పాలి. ఆ గ్లామరస్ ఫోటోలలో బ్లూ కలర్ సారీ కట్టి ఆమె అందాలను అలా ఆరబోసింది. ముఖ్యంగా ఈ భామ నడుముకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అమ్మడి అందాలకు కామెంట్స్ వర్షం కురుస్తోంది. అందులో నెగటివ్ కూడా ఉన్నాయనుకోండి.

ఈ రేంజిలో అందాలు ఆరబోయాలా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ఓ ఫ్యాన్స్ చేసిన కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఏం కామెంట్ చేశాడంటే..'అక్క మా ముఖాలు బయట చూపించలేకపోతున్నాం. మీ ప్రియా చూడు ఫోటోస్ ఎలా పెడుతుందో అని కామెంట్ చేస్తున్నారు. కొంచం మంచిగా పెట్టు అక్క' అని ఫ్యాన్ కామెంట్ చేయగానే దానికి స్పందించిన విష్ణు.. "చూడు నాన్న.. మనం రాళ్లలో కూడా దేవుళ్లను చూస్తాం కదా. చూసే విధానం బట్టి ఉంటుంది. అయినా ఇది నా ప్రొఫెషన్.. అందుకు తగ్గట్టుగా ధరించాల్సి ఉంటుంది. దానిలో తప్పుగా అర్ధం చేసుకునే అవసరం లేదు. నీకు దేవుడు ఆ శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను" అని స్ట్రాంగ్ గానే చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ యాంకర్ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.