Begin typing your search above and press return to search.

ప్రతి అమ్మాయికి సొంత‌ కోరికలు ఉంటాయి!

By:  Tupaki Desk   |   5 Feb 2023 11:01 AM GMT
ప్రతి అమ్మాయికి సొంత‌ కోరికలు ఉంటాయి!
X
పాన్ ఇండియా ట్రెండ్ న‌డుస్తున్న నేటియుగంలో చిన్న హీరో పెద్ద హీరో కొత్త హీరో అనే తేడా లేదు. సినిమాలో కంటెంట్ ఉంటే జ‌నం ఆద‌రిస్తున్నారు. ఇది ఊహించ‌ని ట్రెండ్. కాలంతో పాటు మార్పు అని చెప్పాలి. ఇప్పుడు క‌ల‌ర్ ఫోటో ఫేం సుహాస్ న‌టించిన తాజా చిత్రం రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్ కి క్రిటిక్స్ ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఈ సినిమాకి మిశ్ర‌మ స్పంద‌న‌లు ఉన్నా క‌థ కంటెంట్ మెసేజ్ గురించి ఎక్కువ‌గా డిబేట్లు సాగుతున్నాయంటే మ్యాట‌ర్ ఉంద‌నే అర్థం.

తాజాగా సక్సెస్ వేదిక‌పై ఇండ‌స్ట్రీ డీన్ అల్లు అర‌వింద్ సుహాస్ ని అత‌డి టీమ్ ను పొగిడేసిన తీరు టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీ అయ్యింది. ఈ చిత్రాన్ని పంపిణీ చేసిన అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ``అమ్మాయిలు తమ తల్లిదండ్రులు సోదరులతో కలిసి ఈ సినిమా చూడాల``ని అర‌వింద్ సూచించారు. సినిమాలో నాకు బాగా నచ్చింది చివరి సన్నివేశం.

ప్రతి అమ్మాయికి తన సొంత‌ కోరికలు ఉంటాయి. అది హృదయానికి హత్తుకునేలా చూపించారు. నేను అమ్మాయిలను ఇంట్లో కూర్చోబెట్టడాన్ని ప్రోత్సహించను. స్నేహ... బన్నీ భార్య.. త‌న‌కు పని అవసరం లేదు. ఆమె ధనవంతురాలిగా జన్మించింది. ఆమె ఒక పెద్ద స్టార్ ని వివాహం చేసుకుంది. కానీ ఆమె ఇంకా పని చేస్తోంది. నాకు వ్యక్తిగతంగా అమ్మాయిలు ఇంట్లో కూర్చోవడం ఇష్టం ఉండదు. నేను సినిమా చూసిన తర్వాత మా ఇంటికి వెళ్లి నా భార్యను ఆమె అసలు ఏమి కావాలని కోరుకున్నావు? అని అడుగుతాను... అంటూ త‌న‌దైన పంథాలో అగ్ర‌నిర్మాత పంపిణీదారు అర‌వింద్ ఎమ‌ష‌న‌ల్ స్పీచ్ అల‌రించింది.

నేను ఇప్పటికీ ఎనర్జిటిక్‌గా ఉన్నానంటే కార‌ణం ప్రతిరోజూ యువకులతో సంభాషిస్తాను. నా ఎనర్జీకి కారణం వాళ్లే. షణ్ముఖిని నేను ఇంతకు ముందు చూశాను. కానీ నేను అతని ప్రతిభను గుర్తించలేదు. ప‌ద్మ‌భూష‌ణ్ సినిమాను విడుదల చేద్దాం అని ధీరజ్- వాసు నాతో ప్రపోజ్ చేశారు. సినిమా చూశాక నాకు కూడా అలాగే అనిపించింది. కరోనా లాక్ డౌన్ సమయంలో `కలర్ ఫోటో` పూర్తయిన తర్వాత మహమ్మారి ముగిసే వరకు వారు దొర‌క‌లేదు.

వాళ్ళు సినిమా చూపించగానే బ్రహ్మాండంగా ప్రమోట్ చేసి `ఆహా`లో రిలీజ్ చేశాం. `ఆహా`లో ఇది మా మొదటి సూపర్ హిట్ సినిమా. సుహాస్ సహజమైన నటుడు .. అతని అమాయకత్వాన్ని అమ్మాయిలు ఇష్టపడతారు. నిజానికి తాజా చిత్రం `రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్‌`ని పరిమిత స్క్రీన్ లలో విడుదల చేశాం. బన్నీ వాస్- ధీరజ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అమ్మాయిలారా మీ సోదరులు .. తల్లిదండ్రులతో కలిసి సినిమా చూడండి. చిన్న సినిమాలను చూడటానికి ప్రజలు థియేటర్లకు రారని ఈ విజయం చాలా తప్పు అని నిరూపించింది...`` అంటూ ఎమోష‌న‌ల్ గా వ్యాఖ్యానించారు. నిజానికి మ‌హిళా లోకాన్ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌గలిగే ఫార్ములాను అనుస‌రించ‌డం టీమ్ కి గొప్ప ప్ర‌శంస‌లు ద‌క్కేలా చేస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.