Begin typing your search above and press return to search.

ఘోస్ట్.. జ‌ర్కిన్ల‌తో జెర్కులిస్తున్న బోల్డ్ బ్యూటీ

By:  Tupaki Desk   |   17 May 2022 12:30 AM GMT
ఘోస్ట్.. జ‌ర్కిన్ల‌తో జెర్కులిస్తున్న బోల్డ్ బ్యూటీ
X
బోల్డ్ బ్యూటీ సోనాల్ చౌహాన్ ఏం చేసినా సంథింగ్ స్పెష‌ల్ అనే చెప్పాలి. ఈ అమ్మ‌డు ల‌క్కీగా నాగార్జున మూవీలో యాక్ష‌న్ క్వీన్ త‌ర‌హా పాత్ర‌కు ఎంపికైంది. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ‌లో ఉన్న ఘోస్ట్ లో ఏజెంట్ పాత్ర‌లో క‌నిపించ‌నుంది. ఇందులో సోనాల్ లుక్ ఎలా ఉంటుందో ఇంత‌కుముందే రివీలైంది. బాడీ టైట్ జ‌ర్కిన్ ల‌తో సోనాల్ ర‌చ్చ చేస్తోంది. ఆ మేర‌కు తాజాగా విడుద‌లైన బ‌ర్త్ డే పోస్ట‌ర్ వైర‌ల్ గా మారింది.

ది ఘోస్ట్ టీమ్ ఈ సంద‌ర్భంగా సోనాల్ కి బ‌ర్త్ డే శుభాకాంక్ష‌లు తెలిపింది. స్ట‌న్నింగ్ అండ్ సుప్రీమ్ లో ట్యాలెంటెడ్ యాక్ట్రెస్ సోనాల్ కి హ్యాపీ బ‌ర్త్ డే .. ది ఘోస్ట్ టీమ్ త‌ర‌పున అంటూ విషెస్ ని అందించింది. గ‌గుర్పొడిచే యాక్ష‌న్ థ్రిల్స్ తో సాగే ఈ మూవీ కోసం ఆడియెన్ వేచి చూడ‌లేరు అని ప్ర‌మోష‌న్ లో స్పీడ్ పెంచారు. ప్ర‌వీణ్ స‌త్తారు ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ మూవీ లో నాగ్ లుక్ విడుద‌ల కాగా దానికి అద్భుత స్పంద‌న వ‌చ్చింది.

సోనాల్ ఈ సినిమాతో పాటు ఎఫ్ 3లోనూ న‌టిస్తోంది. విక్టరీ వెంకటేష్ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ క‌థానాయ‌కులుగా న‌టిస్తున్న మ‌ల్టీస్టార‌ర్ కామెడీ కేపర్ F3 చిత్రం 27 మే 2022 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్లలోకి రానుంది. సునీల్ -సోనాల్ చౌహాన్ ఇందులో ముఖ్యమైన పాత్రలలో నటిస్తుండ‌గా పూజా హెగ్డే స్పెష‌ల్ నంబ‌ర్ యాడ్ చేయ‌డం హాట్ టాపిక్ అయ్యింది. ఎఫ్ 3కి అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. దిల్ రాజు తన హోమ్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో నిర్మిస్తున్నారు. టీమ్ ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచింది.

ఈ రోజు ఉదయం F3 మేకర్స్ 2వ సింగిల్ వూ ఆ ఆహా ఆహా ప్రోమో స‌హా లిరిక‌ల్ సాంగ్స్ ఇప్ప‌టికే వైరల్ అయిన సంగ‌తి తెలిసిందే. గత వారం విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను అలరిస్తోంది. 20 మిలియన్లకు పైగా వీక్షణలతో ట్రైలర్ గత 6 రోజులుగా యూట్యూబ్ లో ట్రెండింగ్‌లో ఉంది.